Healthhealth tips in telugu

Joint Pains:కీళ్ళ నొప్పులను దూరం చేసుకోవటానికి కొన్ని చిట్కాలు

Joint Pains:కీళ్ళ నొప్పులను దూరం చేసుకోవటానికి కొన్ని చిట్కాలు.. ఈ మధ్య కాలంలో ముప్పైల్లో అడుగుపెట్టే మహిళల్లో వారి నోటి వెంట తరచుగా కీళ్ళ నొప్పులు అనే మాటను వింటున్నాం.

ఈ సమస్య రావటానికి కారణం కాలేజ్ కి వెళ్ళే వయస్సులో అమ్మాయిలు ఎముక బలానికి అవసరమైన కాల్షియంను తీసుకోకపోవటం అని తాజా అధ్యయనాలు తెలుపుతున్నాయి.

తాజా కూరగాయలు, ఆకుకూరలు తీసుకుంటే అందంతో పాటు ఆరోగ్యం కూడా ఉంటుంది. అయితే చక్కని పోషకాహారం తీసుకోవటంలో అమ్మాయిలు విఫలం అవుతున్నారు. అందుకే ఎదిగే వయస్సులో తగినంత కాల్షియం వారికీ అందటం లేదు.

కాల్షియం లోపించుట వలన చిన్న వయస్సులోనే కీళ్ళ నొప్పుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా పద్దెనిమిది సంవత్సరాల వయసు నుంచి భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని కాల్షియం ఎక్కువగా లభించే రాగులు,నువ్వులు,పెరుగు, పాలు, పాలకూర, గుడ్డు వంటి ఆహారాలకు ఎక్కువ ప్రాదాన్యత ఇవ్వాలి. ఈ విధంగా చేయుట వలన కీళ్ళ నొప్పులు దగ్గరకు రాకుండా చేసుకోవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."