Kitchenvantalu

Cooking Tips:ఇడ్లీ మెత్తగా,మృదువుగా రావాలంటే…..

Best Cooking Tips in Telugu : ఇడ్లీ మెత్తగా,మృదువుగా రావాలంటే…..ఇడ్లీ పిండి రుబ్బే సమయంలో రెండు చుక్కల ఆముదం వేయాలి.

పచ్చికొబ్బరి చిప్ప వారం రోజులు నిల్వ ఉండాలంటే….చిప్ప లోపల నిమ్మరసం రాయాలి.

దుంపకూరలు ఉడికేటప్పుడు ఆ గిన్నె మీద తప్పనిసరిగా మూత పెట్టాలి. ఒకవేళ పెట్టకపోతే అడుగంటే అవకాశముంది.

చపాతీలు మెత్తగా మృదువుగా రావాలంటే అరకేజీ చపాతీపిండికి కప్పు పెరుగు, ఒక మెత్తని అరటిపండు కలపాలి.

పగిలిన గ్రుడ్డును కొంచెం వెనిగర్‌ కలిపిన నీటిలో ఉడకబెడితే లోపలి ద్రవం బయటికి రాదు. బాగా ఉడుకుతుంది. గ్రుడ్డును ఎప్పుడూ తడి పాత్రలోనే పగుల గొట్టాలి. విధంగా చేస్తే పసుపు భాగం పాత్రకు అంటకోదు.

పప్పులు, గోధుమపిండి, శనగపిండి వంటివి పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే గాలి చొరబడని డబ్బాల్లో పోసి వెల్లుల్లి రెబ్బను అందులో వేసి మూతపెట్టాలి.

ఆకుకూరల్ని ఒకటి రెండు రోజులకు మించి నిలువ ఉంచితే అవి వాడిపోతాయి. కనుక కొన్న వెంటనే కూరల్ని నీళ్లలో శుభ్రంగా కడిగి అరగంటసేపు ఉప్పు కలిపిన నీటిలో నానబెట్టాలి. తరువాత పేపరుపై ఆరబెట్టి ఫ్రిజ్‌లో ఉంచితే తాజాగా ఉంటాయి.