Kitchenvantalu

Tiles Cleaning Tips:ఇలా చేస్తే టైల్స్ మధ్య మురికి నిమిషాల్లో మాయం అవుతుంది

Tiles Cleaning Tips in telugu:ఇంటిని శుభ్రం చేయటం అనేది చాలా పెద్ద పని. ముఖ్యంగా టైల్స్ మధ్య మురికి ఎక్కువగా ఉంటే శుభ్రం చేయటం కూడా కష్టమే. ఇప్పుడు చెప్పే చిట్కాలను పాటిస్తే చాలా సులభంగా శుభ్రం చేయవచ్చు.

ఇంటిలో నేలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నా సరే దుమ్ము, ధూళి, తేమ కారణంగా టైల్స్ మధ్య మురికి చేరి శుభ్రం చేయటానికి కష్టమవుతుంది. ఎంత శుభ్రం చేసిన పెద్దగా ఫలితం కనిపించదు. అయితే టైల్స్ మధ్య చేరిన మురికిని తొలగించడానికి ఇప్పుడు చెప్పే చిట్కాలు చాలా ఎఫెక్ట్ గా పని చేస్తాయి.

ఒక కప్పు గోరువెచ్చని నీళ్లు, ఒక కప్పు వెనిగర్ కలిపి స్ప్రే బాటిల్లో పోసి టైల్స్ మధ్య మురికి పేరుకున్న చోట స్ప్రే చేసి ఐదు నిమిషాల తర్వాత బ్రష్ తో రుద్దితే మురికి తొలగిపోయి ఫ్లోర్ శుభ్రంగా తయారవుతుంది.

ఒక గిన్నెలో పావు కప్పు లిక్విడ్ బ్లీచ్, 3/4 కప్పు బేకింగ్ సోడా వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని టైల్స్ మధ్య రాసి 10 నిమిషాలు అయ్యాక పాత టూత్ బ్రష్ సాయంతో రుద్దితే మురికి మొత్తం తొలగిపోయి శుభ్రంగా తెల్లగా మెరిసిపోతుంది.

టైల్స్ మధ్య మురికి తక్కువగా ఉన్నప్పుడు ఇప్పుడు చెప్పే చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. నీటిలో నిమ్మ రసాన్ని కలిపి మురికి ఉన్న చోట స్ప్రే చేయాలి. 10 నిమిషాల తర్వాత స్క్రబ్బర్ తో రుద్దితే మురికి తొలగిపోవటమే కాకుండా టైల్స్ మెరుస్తూ ఉంటాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.