Kitchenvantalu

Mosquitoes:ఈ ఒక్క చిట్కాతో రెండు నిమిషాల్లో దోమలు పరార్

Mosquitoes:ఈ ఒక్క చిట్కాతో రెండు నిమిషాల్లో దోమలు పరార్.. కొంచెం వానలు వచ్చాయంటే చాలు దోమలు వచ్చేస్తూ ఉంటాయి.దోమల కారణంగా మలేరియా డెంగ్యూ వంటి జ్వరాలు వస్తూ ఉంటాయి.

దోమలను తరిమి కొట్టడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అయినా పెద్దగా ఫలితాన్ని ఇవ్వవు. ఇక అప్పుడు జెట్ కోయిల్ వంటివి వాడుతూ ఉంటాం. అలా కోయిల్స్ వాడటం వలన కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అలా కాకుండా మన ఇంటిలో ఉండే కొన్ని వస్తువులను ఉపయోగిస్తే దోమలను తరిమి కొట్టవచ్చు. పది వెల్లుల్లి రెబ్బలు తీసుకొని తొక్క తీసేసి దానిలో పది కర్పూరం బిళ్ళలు వేసుకుని మెత్తగా దంచాలి. ఈ మిశ్రమాన్ని ఒక ప్రమిదలో వేసి ఒక స్పూన్ నెయ్యి కలిపి మంట అంటించాలి.

నెయ్యి కర్పూరం కలిపి మంట రావడానికి సహాయపడతాయి ఈ మిశ్రమం మండుతున్నప్పుడు వచ్చే వాసనకు దోమలు చచ్చిపోతాయి ఈ మిశ్రమాన్ని దోమలు ఉన్న ప్రదేశంలో పెట్టి కిటికీలు తలుపులు వేసి ఉంచాలి అప్పుడు కర్పూరం వెల్లుల్లి ఘాటుకు దోమలు తట్టుకోలేక పారిపోతాయి లేదా చనిపోతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.