Healthhealth tips in telugu

Belly Fat:ఈ స్మూతీని తీసుకుంటే ఆకలి నియంత్రణలో ఉండి అధిక బరువు తగ్గుతారు

Belly Fat:ఈ స్మూతీని తీసుకుంటే ఆకలి నియంత్రణలో ఉండి అధిక బరువు తగ్గుతారు.. ఈ మధ్య కాలంలో మారిన జీవనశైలి కారణంగా అధిక బరువు సమస్య చాలా ఎక్కువగా కనిపిస్తోంది. అధిక బరువుకు ఆకలి ఎక్కువగా వేయటం కూడా ఒక కారణం అని చెప్పవచ్చు. ఆకలి నియంత్రణలో ఉంచడానికి ఈరోజు మనం ఒక స్మూతీ తయారు చేసుకుందాం. .

ఈ స్మూతీ ఉదయం సమయంలో తీసుకుంటే ఆకలి తగ్గడమే కాకుండా అధిక బరువు సమస్య కూడా కంట్రోల్ అవుతుంది. ఈ స్మూతీని కాస్త ఓపికగా చేసుకుంటే చాలా మంచి ఫలితాన్ని పొందవచ్చు. రాత్రి సమయంలో ఒక బౌల్ లో రెండు స్పూన్ల ఎండుద్రాక్ష, పావు స్పూన్ లో సగం కుంకుమపువ్వు వేసి నీటిని పోసి నానబెట్టాలి.

మరుసటి రోజు ఉదయం పొయ్యి వెలిగించి పాన్ పెట్టి ఒక చిన్న కప్పు తామర గింజలను వేసి వేగించి మిక్సీ జార్ లో వేయాలి. ఆ తర్వాత ఒక స్పూన్ పొద్దు తిరుగుడు గింజలు, ఒక స్పూన్ గుమ్మడి గింజలు, ఒక స్పూన్ అవిసె గింజలు, ఒక కప్పు బాదంపాలు, ఒక స్పూన్ పీనట్ బటర్, నానబెట్టిన ఎండుద్రాక్ష కుంకుమపువ్వును నీటితో సహా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుంటే స్మూతీ తయారినట్టే.

ఈ స్మూతీని ఉదయం సమయంలో బ్రేక్ ఫాస్ట్ చేసే సమయంలో తీసుకుంటే ఎక్కువ సేపు కడుపు నిండిన భావన ఉండి తొందరగా ఆకలి వేయదు. అలాగే జంక్ ఫుడ్స్ వైపు మనసు మళ్ల కుండా చేస్తుంది. అంతేకాకుండా జీవ క్రియ రేటును పెంచుతుంది. దాంతో ఆకలి తగ్గి బరువు తగ్గటానికి చాలా .ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. .

అలాగే ఈ స్మూతీని తీసుకోవడం వలన ఎముకలు, కండరాలు దృఢంగా మారి కీళ్ల నొప్పులు, మోకాలు నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. ఉదయం సమయంలో తీసుకోవడం వలన అలసట, నీరసం, నిస్సత్తువ లేకుండా రోజంతా హుషారుగా ఉంటారు. కాబట్టి ఈ స్మూతీ తయారు చేసుకుని బరువు సమస్య నుంచి బయటపడండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.