Healthhealth tips in teluguKitchen

Dry Fruit Laddu:రోజు 1 లడ్డు తింటే అలసట,నీరసం,నొప్పులు లేకుండా హుషారుగా ఉంటారు

Dry Fruit Laddu:రోజు 1 లడ్డు తింటే అలసట,నీరసం,నొప్పులు లేకుండా హుషారుగా ఉంటారు.. మారిన జీవనశైలి కారణంగా ఈ మధ్య కాలంలో వయస్సుతో సంబందం లేకుండా ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉన్నారు. ప్రతి రోజు మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకుంటే మన శరీరానికి అవసరమైన పోషకాలు అంది ఎటువంటి సమస్యలు ఉండవు.

ఇప్పుడు చెప్పే Dry Fruit Laddu ప్రతి రోజు తీసుకుంటే ఏ ఆరోగ్య సమస్యలు లేకుండా రోజంతా హుషారుగా చురుకుగా ఉంటారు. ఈ లడ్డులను ఒకసారి చేసుకొని ఫ్రిజ్ లో పెడితే 15 రోజుల వరకు నిల్వ ఉంటాయి. ఒక కప్పు ఖర్జూరాలను తీసుకొని గింజలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మెత్తని పేస్ట్ గా చేసుకోవాలి.

పావు కప్పు బాదం పప్పు,పావు కప్పు పిస్తా పప్పు,పావుకప్పు జీడిపప్పులను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. పొయ్యి వెలిగించి పాన్ పెట్టి ఒక స్పూన్ నెయ్యి వేసి కాస్త వేడి అయ్యాక 3 స్పూన్ల ఎండుద్రాక్ష,ఒక స్పూన్ గసగసాలు, కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు, పిస్తా, బాదం ముక్కలను వేసి మూడు నిమిషాల పాటు వేగించాలి.

ఆ తర్వాత ఖర్జూరం పేస్ట్ వేసి అన్నీ బాగా కలిసేలా బాగా కలపాలి. ఆ తర్వాత అరస్పూన్ యాలకుల పొడి వేసి బాగా కలపాలి. ఖర్జూరం నుండి నూనె విడుదలయ్యే వరకు వేగించాలి. నూనె విడుదలవుతుంది అనిపించినప్పుడు మంటను ఆఫ్ చేసి రెండు నిమిషాలు చల్లారనివ్వాలి. వెంటనే లడ్డూలను తయారు చేసేయాలి.

ఈ మిశ్రమం పూర్తిగా చల్లారిపోతే.. లడ్డూలుగా రావు. వీటిని వెంటనే తినొచ్చు. లేదా గాలి చేరని కంటైనర్‌లో నిల్వ చేయవచ్చు. ప్రతి రోజు ఒక లడ్డు తింటే అలసట,నీరసం,రక్తహీనత,కీళ్ల నొప్పులు వంటివి ఏమి ఉండవు. ఈ లడ్డును ఏ సమయంలోనైనా తినవచ్చు. ఉదయం సమయంలో తింటే రోజంతా హుషారుగా ఉంటారు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.