Healthhealth tips in telugu

Health Tips:రాత్రి పడుకొనే ముందు 1 గ్లాసు తాగితే.. ఈ సీజన్ లో వచ్చే వ్యాధులకు చెక్‌ పెట్టవచ్చు..!

Immunity booster drink in Telugu : రాత్రి పడుకొనే ముందు 1 గ్లాసు తాగితే.. ఈ సీజన్ లో వచ్చే వ్యాధులకు చెక్‌ పెట్టవచ్చు..మారిన జీవనశైలి ప్రకారం మన ఆరోగ్యం పట్ల శ్రద్ద ఎక్కువ పెట్టవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ సీజన్ లో ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. జలుబు, దగ్గు, ఆస్తమా,గొంతు ఇన్ ఫెక్షన్ వంటి కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి.

ఈ సమస్యలకు చెక్ పెట్టాలంటే మన శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేసుకోవాలి. ఇప్పుడు చెప్తే ఈ పాలను రాత్రి పడుకునే ముందు తాగితే మన రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది. శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తుంది. అలాగే శరీరంలో కొవ్వును కరిగించి అధిక బరువు సమస్యను కూడా తగ్గిస్తుంది.

దానిలో 200 ml నెయ్యి వేయాలి. ఆ తర్వాత 300 గ్రాముల పసుపు., 50 గ్రాముల శొంఠి పొడి, 25 గ్రాముల నల్ల మిరియాల పొడి, 15 గ్రాముల దాల్చిన చెక్క పొడి వేసి… రంగు మారేవరకు సిమ్ లో పెట్టి వేగించాలి.

ఆ తర్వాత ఈ పొడి చల్లారాక టైట్ కంటైనర్ లో స్టోర్ చేయాలి. ఈ పొడి దాదాపుగా నెల రోజులు పాటు నిల్వ ఉంటుంది. రాత్రి పడుకోవటానికి ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలల్లో అర టీ స్పూన్ పొడిని కలిపి తాగాలి. ఈ విధంగా ప్రతి రోజు తాగితే శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది. .

ఈ డ్రింక్ ని నెల రోజులు పాటు తాగితే ఈ సీజన్ లో అంటే చలికాలంలో వచ్చే వ్యాధుల నుంచి బయటపడవచ్చు. అలాగే దగ్గు, జలుబు, ఎలర్జీ, శ్వాస కోశ ఇన్ఫెక్షన్స్ వంటివి కూడా తగ్గుతాయి. కాస్త సమయాన్ని కేటాయించి ఈ పొడిని తయారుచేసుకొని పాలల్లో కలిపి తాగి ఈ సీజన్ లో వచ్చే సమస్యల నుండి బయట పడండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.