Kitchenvantalu

Paakam Puri:పాకం పూరీలను ఈ పద్ధతి లో చేస్తే కనీసం 15 రోజులు నిల్వ ఉంటాయి

Paakam Puri Recipe: పూరి అనగానే, హాట్ హాట్ మసాలా కర్రీ కాంబినేషన్ గుర్తుకు వస్తుంది. కాని పూరిలో స్వీట్ పూరి కూడా, చాలా టెస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలు ఎంతో ఇష్టపడి తినే, సిరప్ పూరిని చేసేద్దాం.

కావాల్సిన పదార్దాలు
మైదా లేదా గోధుమపిండి -250 గ్రాములు
ఉప్పు – ¼ టీ స్పూన్
నెయ్యి – 3 టేబుల్ స్పూన్స్
చక్కెర – 500 గ్రాములు
యాలకులు – 1 టీ స్పూన్
నీళ్లు – 150 మిల్లీలీటర్లు

తయారీ విధానం
1.మైదా లేదా గోధుమ పిండిని ఒక గిన్నెలో తీసుకుని, ఉప్పు,నెయ్యి వేసుకుని, బాగా కలపాలి.
2. తగినన్ని నీళ్లు కలుపుతూ, మెత్తిని ముద్దగా చేసుకోవాలి.
3.ఇప్పుడు ముద్దగా కలుపుకున్న పిండిని, తడిగుడ్డతో, కవర్ చేసి, 30 నిముషాలు పక్కనపెట్టాలి.
4.ఇప్పుడు పాకం కోసం, నీళ్లు , చక్కెర కలుపుకుని పాకం వచ్చేంతవరకు కలుపుతూ ఉండాలి.
5. పాకం వేళ్ల సహాయం తో చెక్ చేసుకోవాలి.

6. పాకం రెడీ అయిన తర్వాత , యాలకుల పొడి వేసుకుని, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
7. ఇప్పుడు ముందుగా కలపి పెట్టుకుని పిండిని చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకోవాలి
8. ఇప్పుడు చపాతీ పీటపై గుండ్రీని పూరీలను తయారు చేసుకోవాలి.
9. చేసిన పూరీ పై నెయ్యిని అప్లై చేసి, మడతపెట్టుకుని మళ్లీ గుండ్రంగా తిప్పుకోవాలి.
10. ఇప్పుడు స్టవ్ పై బాండీ పెట్టుకుని, డీప్ ఫ్రైకి సరిపడా, పూరీలు ఎర్రగా కాల్చుకోవాలి.
11. నూనెలో కాల్చిన పూరీలను పక్కనే పెట్టుకున్న పాకంలో వేసి 30 సెకండ్ల తర్వాత బయటికి తీసుకోవాలి.
12. అంతే నోరు ఊరించే సిరప్ పూరి రెడీ అయినట్లే.
Click Here To Follow Chaipakodi On Google News