Kitchenvantalu

Bananas Tips: వేసవిలో అరటి పండ్లు తొందరగా నల్లగా మారుతున్నాయా…నల్లగా మారకుండా ఉండాలంటే…

Bananas Tips:అరటి పండ్లు తొందరగా నల్లగా మారుతున్నాయా…నల్లగా మారకుండా తాజాగా ఉండాలంటే… సంవత్సరం పొడవుగా చాలా విరివిగా లభిమే అరటి పండ్లలో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. ఎన్నో సమస్యల పరిష్కారానికి అరటి పండు సహాయపడుతుంది. అయితే ఒక్కోసారి అరటి పండ్లను ఎక్కువగా తెస్తూ ఉంటాం. అలాంటి సమయంలో అరటి పండ్లు ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. నల్లగా మారుతూ ఉంటాయి.

అరటి పండ్లలో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అరటిపండును చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే అరటి పండ్లు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఇప్పుడు చెప్పే చిట్కాలను ఫాలో అయితే సరిపోతుంది. సాధారణంగా మనం అరటి పండ్లను తెచ్చిన కొద్ది రోజులకే అవి నల్లగా మారుతూ ఉంటాయి.

అరటి పండ్లు చాలా తొందరగా నల్లగా మారుతూ ఉంటాయి. వీటిని తాజాగా ఉంచడానికి కొన్ని చిట్కాలను ఫాలో అయితే సరిపోతుంది. అరటి పండ్లను ప్రత్యక్ష సూర్యకాంతిలో లేదా ఇతర పండ్ల దగ్గరలో ఉంచకుండా దూరంగా ఉండేలా చూసుకోవాలి. అరటి పండు కాండం చివరను ప్లాస్టిక్ తో చుట్టితే అరటిపండు పక్వానికి వచ్చే ప్రక్రియ నిదానం అయ్యి నాలుగు రోజుల పాటు తాజాగా ఉంటాయి.

అరటి పండ్లను దారం కట్టి వ్రేలాడతీయాలి. ఈ విధంగా చేయడం వలన ఆక్సికరణం మరియు తొందరగా పక్వానికి గురికాకుండా ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి.

అరటి పండ్లను గాలి చొరబడని ప్లాస్టిక్ సంచిలో ఉంచి ఫ్రిజ్లో పెడితే నెలరోజుల వరకు తాజాగా ఉంటాయి. అయితే తినడానికి అరగంట ముందు బయట ఉంచాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు