Kitchenvantalu

Sheer Khurma Recipe : రంజాన్ స్పెషల్ షీర్ కుర్మా.. ఇంట్లో ఈజీగా ఎంతో టేస్టీగా చేసుకోవచ్చు..!

Sheer Khurma Recipe : రంజాన్ స్పెషల్ షీర్ కుర్మా.. ఇంట్లో ఈజీగా ఎంతో టేస్టీగా చేసుకోవచ్చు..రంజాన్ స్పెషల్ రెసీపి షీర్ కుర్మా టేస్టీగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం.

కావాల్సిన పదార్ధాలు
సన్నని వెర్మిసిల్లి – 500 గ్రాములు
పాలు – 1 లీటర్
డ్రై ఫ్రూట్స్ – తగినన్ని
శీతఫల గింజలు – కొద్దిగా
పుచ్చకాయ గింజలు – కొద్దిగా
నెయ్యి- 4 టేబుల్ స్పూన్స్

తయారీ విధానం
1.ముందుగా డ్రై ఫ్రూట్స్ ని ముక్కలుగా కట్ చేసుకోవాలి.
2.ప్యాన్ నెయ్యి వేడి చేసి డ్రై ఫ్రూట్స్ ని వేపుకోని పక్కన పెట్టుకోవాలి.
3.అదే ప్యాన్ లో వెర్మిసిల్లి వేసి వేపి పక్కన పెట్టుకోవాలి.
4.ఇప్పుడు వేరొక ప్యాన్ లోకి పాలు పోసుకోని చిక్కపడే వరకు మరిగించుకోవాలి.
5.చిక్కపడ్డ పాలలోకి చక్కెర,డ్రై ఫ్రూట్స్ వేసి ఐదు నిమిషాలు మరిగించాలి.
6.ఇప్పుడు వేపుకున్న వెర్మిసిల్లిని వేసి యాలకుల పొడి యాడ్ చేసి బాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
7.మూత వేసి పదినిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.
8.పది నిమిషాల తర్వాత సర్వింగ్ బౌల్స్ లో వేసుకోని డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకోని సర్వ్ చేసుకోవడమే.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."