Kitchenvantalu

Rasam Powder:ఆంధ్రా స్టైల్ రసం పొడి ఇలా చేసి పెట్టుకుంటే..పది నిమిషాల్లో రసం రెడీ

Andhra Style Rasam Powder:ఆంధ్రా స్టైల్ రసం పొడి ఇలా చేసి పెట్టుకుంటే..పది నిమిషాల్లో రసం రెడీ.. ఎన్ని రకాల కర్రీస్తో తిన్నా, రెండు ముద్దలు రసంతో తినకపోతే, భోజనం పూర్తిగా అనిపించదు. ఫ్రై కర్రీస్ లోకి మిక్సింగ్ గా, ప్రతీ రోజూ చేసుకునే ఆంధ్ర స్టైల్ రసం కోసం, పొడిని ముందే తయారు చేసుకోవచ్చు. అది ఎలాగో చూసేయండి.

కావాల్సిన పదార్దాలు
ధనియాలు – 1 కప్పు
జీలకర్ర – ¼ కప్పు
మిరియాలు – ¼ కప్పు
రెడ్ గ్రామ్ – ¼ కప్పు
ఎండుమిర్చి – 15
కరివేపాకు – 25 గ్రాములు

తయారీ విధానం
1.స్టవ్ ఆన్ చేసి, ఒక మందపాటి పాన్ పెట్టుకుని, అందులోకి ధనియాలను వేసి, దోరగా మంచి వాసన వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి.
2. అదే పాన్ లో మిరియాలు, రెడ్ గ్రామ్, జీలకర్ర వేయించుకుని పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు పచ్చి కరివేపాకు కూడా తేమ పోయేంతవరకు వేయించుకోవాలి.
4. వేయించుకున్న దినుసులను చల్లాలిన తర్వాత మిక్సీ జార్ లో వేసుకుని కొద్దిగా బరకగా పౌడర్ గ్రైండ్ చేసుకోవాలి.
5. చింతపండు రసం లోకి ఈ రసం పౌడర్ ను యాడ్ చేసుకుంటే , కమ్మటి రసం తయారైనట్లే.
Click Here To Follow Chaipakodi On Google News