Kitchenvantalu

Palak Pulka Recipe:పాలకూర తో మెత్తటి పుల్కాలు ఇలా సులభంగా చేసుకోండి…

Palak Pulka Recipe:పాలకూర తో మెత్తటి పుల్కాలు ఇలా సులభంగా చేసుకోండి… ఆహారం అంటే ఆరోగ్యంతో పాటు రుచి కూడా ఉండాలి. డైట్ లో ఉన్నవారికి, షుగర్ పేషెంట్స్ కు, స్కూల్ కు వెళ్లే పిల్లల కోసం, ఆరోగ్య కరమైన రోటీలను తయారు చేసేద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం బచ్చలికూర పుల్కా తయారు చేసేద్దాం

కావాల్సిన పదార్దాలు
గోధుమ పిండి -2 కప్పులు
బచ్చలి కూర – 3 కట్టలు
ఉప్పు –తగినంత
చాట్ మసాలా – 1 టీ స్పూన్
జీలకర్ర పొడి – 1 టేబుల్ స్పూన్
అల్లం – 1 ఇంచ్
పచ్చిమిర్చి -5

తయారీ విధానం
1.స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెలో , తగినంత నీరు పోసి, కట్ చేసుకున్న బచ్చలికూర ఆకులను తీసుకోవాలి.
2. అవి మెత్తపడే వరకు మూత పెట్టి ఉడికించాలి.
3. ఉడికిన బచ్చలి కూర ఆకులను మిక్సీ జార్ లోకి తీసుకుని, అందులోకి అల్లం,పచ్చిమిర్చి, వేసుకుని మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. అససరం అనుకుంటే కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు.
4. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకుని గోధుమపిండి తగినంత ఉప్పు , బచ్చలి కూర పేస్ట్ వేసి, మెత్తని ముద్దలా కలపండి.
5. కొద్దికొద్దిగా నీరు కలుపుతూ సాఫ్ట్ గా తయారు చేసుకోవాలి.

6.కలిపిన ఆ పిండి ముద్దను తడిగుడ్డను కప్పి, 30 నిముషాలు పక్కనపెట్టుకోవాలి.
7. 30 నిముషాల తర్వాత, చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకుని, రోటీలుగా తయారు చేసుకోవాలి.
8. ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టుకుని, రోటీస్ ను రెండు వైపులా కాల్చుకోవాలి.
9. రెండు వైపులా కాలిన రోటీలను స్టవ్ పై ఒక గ్రీల్ పెట్టుకుని, ఫ్లేమ్ పై రోటీలు ఉబ్బేవరకు కాల్చుకోవాలి.
10. ఇప్పుడు రోటీ వేడిగా ఉండగానే, రెండు చుక్కల నెయ్యి అప్లై చేసుకుంటే, రోటీలు మృదువుగా ఉంటాయి.
11. నెయ్యి వద్దూ అనుకునే వాళ్లు, కాటన్ క్లాత్ లో పెట్టి ఉంచినట్లైతే మెత్తగా ఉంటాయి.