Healthhealth tips in telugu

Onion in Summer: వేసవి ఎండల్లో.. శరీరాన్ని చల్లబరిచే దివ్య ఔషధం మన ఇంట్లోనే..

Onion in Summer: వేసవి ఎండల్లో.. శరీరాన్ని చల్లబరిచే దివ్య ఔషధం మన ఇంట్లోనే.. ప్రతి రోజు ఉల్లిపాయను ఆహారంలో బాగంగా చేసుకుంటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. ఉల్లిపాయ వాసన కారణంగా చాలా మంది తినటానికి ఇష్టపడరు. కానీ వాటిలో ఉన్న ప్రయోజనాలను తెలుసుకుంటే తప్పనిసరిగా తినటం అలవాటుగా చేసుకుంటారు.

ఈ రోజుల్లో చాలా మంది కీళ్ళ నొప్పులు, కొలస్ట్రాల్ సమస్యలతో బాధ పడుతున్నారు. వీటిని అదుపు చేయాలంటే ఆహారంలో ఉల్లిపాయను చేర్చుకోవాలి.ఇది రక్తంలో గడ్డలను కరిగిస్తుంది. అలాగే గుండె నొప్పులకు కారణమయ్యే కొలస్ట్రాల్ సమస్యను అదుపులో ఉంచి ట్రైగిజరాయిడ్స్ పెరగకుండా చేస్తుంది.

ఉల్లిపాయలో ఉండే ప్లవనాయిడ్స్ గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది. మోనోపాజ్ కి ముందు ఎముకలు సాంద్రత కోల్పోయి గుల్లబారతాయి. అప్పుడు ఉల్లిపాయను తగిన మోతాదులో తీసుకుంటే ఈ సమస్య నుండి బయట పడవచ్చు. ఉల్లిలో ఉన్న కొన్ని పోషకాలు శరీరానికి వ్యాది నిరోదకత శక్తిని అందించి వివిధ రకాల వ్యాధులు రాకుండా కాపాడతాయి.

ప్రతి రోజు ఒక మోస్తరు సైజ్ ఉల్లిపాయను తీసుకుంటే అండాశయ క్యాన్సర్ ను అదుపు చేస్తుంది. బ్యాక్టీరియా సంబందిత ఇన్ఫెక్షన్ నివారించి,రక్తంలో చక్కెర స్థాయిలను సమంగా ఉండేలా చేస్తుంది. తద్వారా మధుమేహ వ్యాది అదుపులో ఉంటుంది.

ఉల్లిపాయను నూనెలో ఎక్కువగా వేగించినప్పుడు కన్నా ఆవిరిలో ఉడికించి నప్పుడు అధిక ప్రయోజనాలు ఉంటాయి.జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడానికి, పొట్టను ఆరోగ్యంగా ఉంచడానికి ఉల్లిపాయ సహాయపడుతుంది.

వేసవి కాలంలో ఈ ఉల్లిపాయను కూరల్లో కంటే.. పచ్చిది తినడం వల్ల సమ్మర్ హీట్ నుంచి బయట పడొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఉల్లిపాయల్ని పచ్చివి తినడం వల్ల.. వడదెబ్బ, చెమట కాయలు, డీహైడ్రేషన్, జీర్ణ సమస్యలు రాకుండా చేస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.