Kitchenvantalu

Coconut Laddu:సింపుల్ గా 2 నిమిషాల్లో కొబ్బరి లడ్డు చేసుకుందామా…

Coconut Laddu:సింపుల్ గా 2 నిమిషాల్లో కొబ్బరి లడ్డు చేసుకుందామా…కొబ్బరి లడ్డు అంటే చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు అందరికి ఇష్టమే. సింపుల్ గా ఈ పద్దతిలో చేసుకుంటే చాలా త్వరగా అయ్యిపోతుంది.

కావాల్సినవి పదార్థాలు:
కొబ్బరికాయ-1(ముదురుగా ఉండాలి)
పాలు – ఒక లీటరు
బొంబాయి రవ్వ – అరకప్పు
పంచదార – తగినంత
యాలకుల పొడి – రెండు చిటికెలు
నెయ్యి – తగినంత

తయారీ విధానం:
ముందుగా కొబ్బరికాయను కొట్టి కొబ్బరి తురమాలి. మూకుడులో ఒక స్పూన్ నెయ్యి వేసి బొంబాయి రవ్వ వేసి దోరగా వేగించాలి. ఒక గిన్నెలో నీరు కలపని పచ్చిపాలు, కొబ్బరి తురుము, చక్కెరను వేసి మరగనివ్వాలి.

ఆ మిశ్రమం చిక్కబడే సమయంలో బొంబాయి రవ్వ, యాలకుల పౌడర్ ను వేసి బాగా కలపాలి. కొన్ని నిమిషాల తర్వాత ఆ పాత్రను గ్యాస్ మీద నుండి తీసి చల్లారిన తర్వాత లడ్డూలుగా తయారు చేసుకుంటే అంతే రుచికరమైన కొబ్బరి లడ్డూలు రెడీ.