Kitchenvantalu

Egg Kichidi:కేవలం10 నిమిషాల్లో అయిపోయే ఈ కిచిడీని ట్రై చేయండి

Egg Kichidi:కేవలం10 నిమిషాల్లో అయిపోయే ఈ కిచిడీని ట్రై చేయండి.. బెంగాలీ స్పెషల్, డిమెర్ కిచురి ఎప్పుడైనా టేస్ట్ చేసారా,అదే నండీ ఎగ్ తో కిచ్డీ. ఎగ్ తో కిచ్డీ ట్రై చేయకపోతే, ఈసారి ట్రై చేసి చూడండి.

కావాల్సిన పదార్ధాలు
కిచిడీ కోసం..
పెసరపప్పు – 1కప్పు
బియ్యం – 1 కప్పు
పసుపు – 1/2టేబుల్ స్పూన్
ఉప్పు – తగినంత
నీళ్లు – 6 కప్పులు
వేడినీళ్లు – 1.5 కప్పు
సోయ – 1/4కప్పు
ఆలు -1
గుడ్లు – 2

తాళింపు కోసం..
నూనె – 8 టేబుల్ స్పూన్స్
ఎండుమిర్చి – 5
బిర్యాని ఆకులు – 2
సోంపు -1/2టేబుల్ స్పూన్
జీలకర్ర – 1 టేబుల్ స్పూన్
అల్లం తురుము – 1/4టేబుల్ స్పూన్
పచ్చిమిర్చి -3
కొత్తిమీర – కొద్దిగా

తయారీ విధానం
1.సోయచంక్స్ ను వేడి నీళ్లు పోసి, నానపెట్టుకోవాలి.
2.ఆలుని తొక్క తీసి, నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలి.
3.పెసరపప్పును, బియ్యాన్ని, విడి విడిగా వేపుకోని, నీళ్లు పోసి, శుభ్రంగా కడుక్కోవాలి.
4.కడిగిన పప్పు, బియ్యాన్ని, కుక్కర్ లో వేసి, ఆలు, పసుపు, ఉప్పు, కొద్దిగా నూనే, ఆరు కప్పుల నీళ్లు పోసి,కుక్కర్ మూత పెట్టి, 5 నుంచి 6 విజిల్స్ రానివ్వాలి.
5. స్టీమ్ పొయిన తర్వాత, మెత్తగా ఉడికిన కిచ్డీ లోంచి ఆలు ముక్కలు తీసి పక్కనపెట్టండి.
6.స్టవ్ ఆన్ చేసి, వేడి నీళ్లు పోసి, అన్నాన్ని మెత్తగా మెదపండి.

7.వేరొక ప్యాన్ లో , రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి , రెండు గుడ్లు బాగా బీట్ చేసి, నూనెలో పోసుకోవాలి.
8. గుడ్లపైన చిటికెడు ఉప్పు వేసి, పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి.
9.అదే మూకుడులో, నూనె వేడి చేసి, అందులో, ఎండుమిర్చి, బిర్యాని, ఆకులు, సోంపు, జీలకర్ర వేసి,వేగనివ్వాలి,
10. వేగిన తాళింపులో, అల్లం, పచ్చిమిర్చి తరుగు, వేసుకుని, వేపుకోవాలి.
11. నానపెట్టుకున్న సోయను, నీళ్లు పిండేసి, వేసుకుని, వేపుకోవాలి.
12. వేగిన సోయాలో వేపుకున్న గుడ్డుముక్కలు వేసి, టాస్ చేసుకోవాలి.
13. టాస్ చేసుకున్న మిశ్రమాన్ని, కిచ్డీలో వేసి, కలిపేసుకోవాలి.
14. చివరగా, కొత్తిమీర, పక్కనపెట్టుకున్న ఆలు ముక్కలు వేసి, సెర్వ్ చేసుకోవడమే.