Kitchenvantalu

Tomato Coconut Pulao: ఉల్లి,వెల్లుల్లి లేకుండా కొబ్బరి పాలు, టమోటోతో పులావ్ చేస్తే సూపర్ అంటారు..

Tomato Coconut Pulao: ఉల్లి,వెల్లుల్లి లేకుండా కొబ్బరి పాలు, టమోటోతో పులావ్ చేస్తే సూపర్ అంటారు.. ఉల్లి,వెల్లుల్లి ఘాటు,కొబ్బరి పాల తీపి,టమాటో పులుపు తో కమ్మని పలావ్ చేసేద్దాం. ఒక సారి చేసుకొని తింటే మరల మరల తినాలని అనిపిస్తుంది.

కావాల్సన పదార్ధాలు
టమాటోలు – 5
పచ్చి కొబ్బరి ముక్కలు – 1.5 కప్పు
పచ్చిమిర్చి – 5
నూనె – 2 టేబుల్ స్పూన్
బిర్యానీ ఆకులు – 2
దాల్చిన చెక్క – 2 ఇంచ్ లు
లవంగాలు – 4-5
నీళ్లు – 1 కప్పు
కొబ్బరి పాలు – 1.5 కప్పు
టమాటో గుజ్జు – 1.5 కప్పు
ఉప్పు – తగినంత
బియ్యం – 1.5 కప్పు

తయారీ విధానం
1.టమాటో పండ్లకి ఘాట్లు పెట్టి నీళ్లు పోసి టమాటో పైన తోలు వదిలేలా ఉడికింకుకోవాలి.
2.టమాటో పైన తోలు తీసి మిక్సిలో వేసి మెత్తని పేస్ట్ లా చేసుకోని,జల్లెడలో వేసి వడగట్టుకోవాలి.
3.పచ్చి కొబ్బరి ముక్కల్లో కొద్దిగా నీళ్లు పోసి మిక్సిజార్ లో వేసి గ్రైండ్ చేసుకోని క్లాత్ లో వేసి వడగట్టుకుంటే చిక్కని కొబ్బరి పాలు వస్తాయి.
4. స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని నూనె వేడి చేసి అందులో మసాలాలు పచ్చిమిర్చి వేసి ఎర్రగా వేపుకోవాలి.

5.కడిగి నానబెట్టుకున్న బియ్యం వేసి బియ్యాన్ని వేపుకోవాలి.
6.వేగిన బియ్యంలో కొబ్బరి పాలు టమాటో గుజ్జు నీళ్లు ,ఉప్పు,వేసి కలిపి మూతపెట్టి మీడియం ఫ్లేమ్ పై అన్నం ఉడికించుకోవాలి.
7.అన్నం ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకోని 10-15 నిమిషాలు వదిలేస్తే అన్నం పొడి పొడిగా ఉంటుంది.
8.పదిహేను నిమిషాల తర్వాత వేడి వేడి టమాటో కొబ్బరి అన్నం సర్వ్ చేసుకోవడమే.