Kitchenvantalu

Crispy Semiya Cutlets:స్వీట్ షాప్స్ స్పెషల్ డబుల్ క్రిస్పీ సేమియా వెజ్ కట్ లెట్స్

Crispy Semiya Cutlets:స్వీట్ షాప్స్ స్పెషల్ డబుల్ క్రిస్పీ సేమియా వెజ్ కట్ లెట్స్.. ఇంట్లో ఉండే పదార్ధాలతోటి ఎన్నో వెరైటీ రెసిపీస్ చేసుకోవచ్చు.రోజు చేసేవి కాకుంట కొత్తగా ట్రై చేయాలంటే సేమియా కట్లెట్స్ చేసేయండి పిల్లలు భలే ఇష్టపడతారు

కావాల్సిన పదార్ధాలు
కట్లెట్స్ కోసం
మందం అటుకులు – 1 కప్పు
ఉడికించిన ఆలు – 2
పచ్చిమిర్చి – 1 టేబుల్ స్పూన్
ఉల్లిపాయ – 2 టేబుల్ స్పూన్
ఫ్రోజెన్ కార్న్ – 3 టేబుల్ స్పూన్
క్యారట్ తురుము – 3 టేబుల్ స్పూన్
కాప్సికం తరుగు – 2 టేబుల్ స్పూన్
చాట్ మసాలా – ¼ టేబుల్ స్పూన్
మిరియాల పొడి – ½ టేబుల్ స్పూన్
ఉప్పు – తగినంత
కారం – ½ టేబుల్ స్పూన్
కొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్
నిమ్మరసం – 1 టేబుల్ స్పూన్
నూనె – వేపుకోవడానికి
కోటింగ్ కోసం
మైదా – ¼ కప్పు
నీళ్లు – 1/3 కప్పు
శనగపిండి – ½ కప్పు
సన్నని సేమియా – 150 గ్రాములు

తయారీ విధానం
1.అటుకులు జల్లించి నీళ్లతో బాగా తడిపి 15 నిమిషాలు వదిలేస్తే అటుకులు బాగా మెత్తపడ్తాయి.
2.మెత్తగా ఉడికించిన ఆలుని తురుముకోని అటుకులలో వేసుకోవాలి.
3.కట్లెట్ కోసం తీసుకున్న పదార్ధాలన్ని వేసి బాగా కలుపుకోవాలి.
4.ఇప్పుడు వేరొక బౌల్ లో మైదాను కొద్దిగా నీళ్లు పోసి పల్చని మజ్జిగ లాగా కలుపుకోవాలి.

5.వేరొక గిన్నెలో శనగపిండిలో ఉప్పు వేసి పక్కన పెట్టుకోండి.
6.కలుపుకున్న కట్లెట్స్ మిశ్రమాన్ని నచ్చిన ఆకారంలో చేసుకోవాలి.
7.తయారు చేసుకున్న కట్లెట్స్ ను ముందు మైదాలో ముంచి తరువాత శనగపిండిలో రోల్ చేసి ,వెంటనే సేమియాలో దొర్లించఆలి.
8.కోట్ చేసుకున్న కట్లెట్స్ ను వేడి వేడి నూనెలో వేసుకోవాలి.
9.స్టవ్ మీడియం ఫ్లేమ్ పై పెట్టుకోని కట్లెట్స్ ని తిప్పుకుంటు ఎర్రగా కాల్చుకోవాలి.
10.అంతే టేస్టీ టేస్టీ సేమియా కట్లెట్స్ రెడీ.