Healthhealth tips in telugu

Kallu Uppu:కళ్ళు ఉప్పు వాడుతున్నారా… ఈ నిజాలు తెలుసుకోండి

Kallu Uppu:కళ్ళు ఉప్పు వాడుతున్నారా… ఈ నిజాలు తెలుసుకోండి.. వంటల్లో ఉప్పు లేకపోతే రుచి ఉండదు. మనం సాల్ట్ వాడుతూ ఉంటాం. అలా కాకుండా కళ్ళు ఉప్పు వాడితే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఈ కళ్ళు ఉప్పును ఎక్కువగా ఆయుర్వేద మందుల తయారీలో ఉపయోగిస్తున్నారు. ఈ ఉప్పులో మెగ్నీషియం, పొటాషియం ఎక్కువగా ఉంటాయి.

జీర్ణక్రియ మెరుగు పరిచి తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చేసి కడుపుకు సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది. దీనిలో ఉండే పొటాషియం రక్తప్రసరణలో హెచ్చుతగ్గులను కంట్రోల్ చేసి రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉండేలా చేస్తుంది. నిద్రలేమి సమస్యను తొలగిస్తుంది. .

ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో అర స్పూన్ ఉప్పును కలిపి బాగా కరిగాక తాగితే మానసిక ఒత్తిడి దూరమై ప్రశాంతత కలుగుతుంది. స్నానం చేసే నీటిలో ఈ ఉప్పును వేసి స్నానం చేస్తే చర్మంపై ఉన్న మలినాలు తొలగిపోయి చర్మం కాంతివంతంగా మారుతుంది. షాంపూ లో కాస్త ఉప్పు వేసి తల రుద్దుకుంటే జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. ఇది మంచి యాంటీబయటిక్. గొంతు నొప్పిగా ఉన్నప్పుడు గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసి గార్గిల్ చేస్తే మంచి ఉపశమనం కలుగుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.