Healthhealth tips in telugu

Left Side Sleeping :ఎడమ వైపు తిరిగి పడుకుంటున్నారా… అయితే ఈ సమస్యలన్నీ…

Left Side Sleeping :ఎడమ వైపు తిరిగి పడుకుంటున్నారా… అయితే ఈ సమస్యలన్నీ…మనిషి ఆహారం లేకపోయినా బ్రతకగలడు. కానీ నిద్ర లేకపోతే జీవించడం కష్టం. సరైన నిద్ర లేకపోతే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి.

నిద్ర పోవడం ఎంత ముఖ్యమో ఎలా నిద్రపోతున్నావు అనేది కూడా ముఖ్యం. కొంతమంది ఎడమ వైపుకి తిరిగి పడుకుంటే మరికొంతమంది కుడివైపుకు తిరిగి పడుకుంటే మరికొందరు స్ట్రైట్ గా పడుకుంటారు. .

అయితే నిపుణులు ఎడమ వైపు తిరిగి పడుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్తున్నారు . ఎడమ వైపు ఎందుకు మంచిది అంటే జీర్ణశయం మూత్రాశయం సోష రస గ్రంధులు క్లోమం కడుపుకు ఎడమ వైపు ఉంటాయి. మనం తీసుకున్న ఆహారం జీర్ణం కాగా మిగిలిన వ్యర్థాలు బయటకు పంపే సామర్థ్యాన్ని కలిగి ఉండాలంటే వాటిపై ఒత్తిడి లేకుండా చూసుకోవాలి.

ఎడమ వైపు తిరిగి పడుకోవడం వల్ల రక్త ప్రసరణ వ్యవస్థ పనితీరు మెరుగ్గా ఉంటుంది. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. కాలేయం కిడ్నీలపైఒత్తిడి లేకుండా ఉంటుంది. అలాగే కడుపులో ఉన్న యాసిడ్స్ గొంతు లోకి రావడం వల్ల గుండె మంట వచ్చే ప్రమాదం ఉంది. ఎడమ వైపు నిద్రిస్తే అలాంటి సమస్య ఉండదు. ఎడమ వైపు పడుకోవడం వల్ల ఆహారంలో ఉండే కొవ్వు పదార్థాలు త్వరగా జీర్ణమవుతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.