Healthhealth tips in telugu

Gas Problem:1 గ్లాసు పొట్టలో ఉన్న గ్యాస్ మొత్తాన్ని బయటకు పంపి పొట్టను క్లీన్ చేస్తుంది

Gas Problem:1 గ్లాసు పొట్టలో ఉన్న గ్యాస్ మొత్తాన్ని బయటకు పంపి పొట్టను క్లీన్ చేస్తుంది.. మసాలా ఆహారాలు ఎక్కువగా తినటం వలన, సరైన సమయంలో భోజనం చేయకపోవటం వంటి కారణాలతో అజీర్ణం,గ్యాస్,కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. గ్యాస్ సమస్య వచ్చిందంటే ఒక పట్టానా తగ్గదు. అయితే ఎటువంటి మందులు వాడకుండా ఇంటి చిట్కాలతో తగ్గించుకోవచ్చు.

ఘాటైన రుచి కలిగిన వాము జీర్ణ సమస్యలను తగ్గించటానికి చాలా బాగా పనిచేస్తుంది. వాములో ఫైబర్, మినరల్స్, విటమిన్లు మరియు యాంటీఆక్సిడెంట్లు సమృద్దిగా ఉంటాయి. వాములోని క్రియాశీల ఎంజైమ్‌లు, థైమోల్, జీర్ణక్రియను మెరుగుపరిచే గ్యాస్ట్రిక్ జ్యూస్‌ల స్రావానికి సహాయపడుతుంది.

అజీర్ణం కారణంగా సంభవించే అన్నీ సమస్యలను తగ్గించటానికి వాము సహాయపడుతుంది. ఎసిడిటీ మరియు అజీర్ణం నుండి తక్షణ ఉపశమనాన్ని అందిస్తుంది. అరస్పూన్ వాములో చిటికెడు ఉప్పు కలిపి నమిలి మింగాలి. ఆ తర్వాత ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తాగాలి. లేదా పొయ్యి మీద గిన్నె పెట్టి దానిలో ఒక గ్లాసు నీటిని పోసి అరస్పూన్ వాము వేసి మరిగించాలి.

మరిగిన ఈ నీటిని ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి గోరువెచ్చగా ఉన్నప్పుడూ తాగాలి. ఈ విధంగా తాగటం వలన పొట్టలో ఉన్న గ్యాస్ మొత్తాన్ని బయటకు పంపి పొట్టను క్లీన్ చేస్తుంది. అలాగే వాములో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి అనేవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

దాంతో సీజనల్ గా వచ్చే దగ్గు,జలుబు,గొంతు నొప్పి వంటివి ఏమి రావు. శరీరంలో రక్త సరఫరా బాగా సాగు రక్తపోటు నియంత్రణలో ఉండటమే కాకుండా కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రణలో ఉంచి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. కాబట్టి ఈ సీజన్ లో వామును ఏదో ఒక రూపంలో తీసుకోవటానికి ప్రయత్నం చేయండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.