Beauty TipsHealthhealth tips in telugu

pulipirlu:నిమ్మరసంలో ఇది కలిపి రాస్తే చాలు ఒక్క రోజులో పులిపిర్లు నొప్పి లేకుండా రాలిపోతాయి

pulipirlu:నిమ్మరసంలో ఇది కలిపి రాస్తే చాలు ఒక్క రోజులో పులిపిర్లు నొప్పి లేకుండా రాలిపోతాయి.. ఈ మధ్య కాలంలో ఎక్కువమంది పులిపిర్ల సమస్యతో బాధపడుతున్నారు. పులిపిరికాయలని ఇంగ్లీష్ లో వార్ట్స్ అని కూడా అంటారు. ఇవి ఎక్కువగా మెడ మీద ముఖం మీద చేతులు మీద పాదాలు మీద వస్తూ ఉంటాయి. వీటిని అసలు అశ్రద్ద చేయకూడదు. వీటిని తొలగించుకోవటానికి మంచి ఇంటి చిట్కాలు ఉన్నాయి.

ఆరు వెల్లుల్లి రెబ్బలను తీసుకొని పొట్టు తీసి దంచి రసం తీయాలి. ఒక బౌల్ లో వెల్లుల్లి రసం, అరచెక్క నిమ్మరసం,ఒక స్పూన్ బేకింగ్ సోడా వేసి బాగా కలపాలి. బేకింగ్ సోడా పడని వారు సున్నం వాడవచ్చు. ఈ మిశ్రమంను టూత్ పిక్ గాని పుల్లతో గాని పులిపిర్లు ఉన్నచోట రాసి ప్లాస్టర్ వేయాలి.

మూడు గంటల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఈ పద్దతిని రాత్రి సమయంలో చేసి మరుసటి రోజు ఉదయం శుభ్రం చేసుకున్న పర్వాలేదు. ఈ విధంగా రోజుకి ఒకసారి చేస్తూ ఉంటే క్రమంగా పులిపిర్లు రాలిపోతాయి. పులిపిర్లకు కారణం అయిన వైరస్ ని తొలగించటానికి వెల్లుల్లి చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.

పులిపిర్లు రాగానే చాలా మంది పులిపిర్లను కాల్చడం, కత్తిరించడం వంటివి చేస్తూ ఉంటారు. అలా చేయకుండా ఈ చిట్కా ఫాలో అయితే చాలా మంచి ఫలితం వస్తుంది. కాబట్టి ఈ చిట్కా ట్రై చేయండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.