Healthhealth tips in telugu

Summer Drink:వడగాలులు, ఎండ దెబ్బ వల్ల వేడెక్కిన శరీరాన్ని క్షణాల్లో చల్లబరుస్తుంది

Summer Drink:వడగాలులు, ఎండ దెబ్బ వల్ల వేడెక్కిన శరీరాన్ని క్షణాల్లో చల్లబరుస్తుంది.. వేసవిలో ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. వేసవిలో వడదెబ్బ, వడ గాలుల కారణంగా వేడి ఎక్కిన శరీరాన్ని చల్లబరుచు కోవటానికి ఒక మంచి పానీయం ఉంది. ఇది తాగితే నిమిషంలోనే శరీరంలో వేడి తగ్గి చల్లగా మారుతుంది. అలాగే అలసట,నీరసం వంటివి కూడా ఉండవు.

చెరుకు రసం 3 లీటర్లు తీసుకొని పొయ్యి మీద పెట్టి రెండు లీటర్లు అయ్యేవరకు మరిగించాలి. ఆ తర్వాత చల్లార్చి సీసాలో పోసి ఫ్రిజ్ లో పెడితే దాదాపుగా నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఒక గ్లాస్ నీటిలో ఈ రసంను 5 స్పూన్లు వేసి బాగా కలపాలి. ఆ తర్వాత పావుస్పూన్ లో సగం మిరియాల పొడి, పావుస్పూన్ లో సగం యాలకుల పొడి కలిపి తాగాలి.

ఎండలో బయటకు వెళ్ళే ముందు తాగితే చాలా మంచిది. ఈ పానీయంను అన్నీ వయస్సుల వారు తాగవచ్చు. వేసవిలో వచ్చే వడదెబ్బ, అలసట వంటివి ఏమి ఉండవు. ఈ రసంలో ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన శరీరంలో బరువును తగ్గించటానికి సహాయపడుతుంది. అలాగే చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ని పెంచుతుంది.

ఇందులో ఫైబరే కాదు.. ప్రోటీన్లు, పొటాషియం, కాల్షియం, ఐరన్,జింకు అమైనో యాసిడ్లు ఉంటాయి..ఇవి శరీరంలోని బరువును ఎంచక్కా తగ్గిస్తాయి. చెరకు రసంలో సుక్రోజ్ రూపంలో ఉండే చెక్కరను శరీరం తేలిగ్గా జీర్ణం చేసుకుంటుంది. కాబట్టి చెరకు రసం తాగగానే తక్షణం శరీరానికి శక్తి వస్తుంది. డీహైడ్రేషన్ బారిన పడిన వారు చెరకు రసం తాగితే త్వరగా కోలుకుంటారు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.