Healthhealth tips in telugu

Mustard Leaves:ఈ ఆకును ఎప్పుడైనా తిన్నారా…ఊహించని ప్రయోజనాలు ఎన్నో…అసలు నమ్మలేరు

Mustard Leaves:ఈ ఆకును ఎప్పుడైనా తిన్నారా…ఊహించని ప్రయోజనాలు ఎన్నో…అసలు నమ్మలేరు.. మనం సాదారణంగా తోటకూర, గోంగూర వంటి ఆకుకూరలను రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటాం. ఆవాల ఆకులను కూడా ఆకుకూరల వలె వాడవచ్చు. వీటిలో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

ఆవాల ఆకులలో ఫైబర్ (పీచు పదార్థం), విటమిన్లు, ఐరన్, ఫోలిక్ యాసిడ్, కాల్షియం, పొటాషియం, ఫాస్పరస్, మెగ్నీషియం వంటి మినరల్స్ సమృద్దిగా ఉండుట వలన… వీటిని తీసుకోవటం వలన చలికాలంలో మన శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి ఎటువంటి ఇన్ ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. ఈ ఆకులు శరీరంలో వేడిని పెంచుతాయి.

ఈ ఆకులలో విటమిన్ సి సమృద్దిగా ఉండుట వలన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే యాంటీఆక్సిడెంట్లు సమృద్దిగా ఉండుట వలన ఫ్రీ రాడికల్స్‌తో పోరాటం చేసి అనేక వ్యాధులను నివారిస్తుంది. విటమిన్ ఎ సమృద్దిగా ఉండుట వలన కంటికి సంబందించిన సమస్యలు ఏమి లేకుండా చేసి కంటి చూపు మెరుగుదలకు సహాయపడుతుంది.

ఈ ఆకులలో వేడి గుణం ఉండుట వలన చెడు కొలెస్ట్రాల్ తొలగించి రక్త ప్రవాహం బాగా సాగేలా చేసి రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేసి గుండెకు ఎటువంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఈ ఆకులలో ఇనుము, కాల్షియం మరియు విటమిన్ K సమృద్ధిగా ఉండుట వలన ఎముకలు బలంగా ఆరోగ్యంగా ఉండి కీళ్ళనొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తుంది.

ఆవాల ఆకులలో ఉండే ఫైటోన్యూట్రియెంట్లు మరియు యాంటీఆక్సిడెంట్లు కణాలకు ఆక్సీకరణ నష్టాన్ని తగ్గించడంలో ప్రయోజనకరంగా ఉంటాయి. విటమిన్ ఎ పుష్కలంగా ఉండుట వలన ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడుతుంది. ఈ ఆకులను ఉడికించి తీసుకోవచ్చు… లేదంటే సూప్‌లు, పాస్తా, సలాడ్‌లు, స్మూతీస్ లేదా జ్యూస్‌లకు కలిపి తీసుకోవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.