Healthhealth tips in telugu

Ajwain:వాము గురించి ఈ నిజం తెలుసుకోకపోతే చాలా నష్టపోతారు…ఇది నిజం

Ajwain:వాము గురించి ఈ నిజం తెలుసుకోకపోతే చాలా నష్టపోతారు…ఇది నిజం.. మన వంటగదిలో ఉండే వాములో ఎన్నో పోషక విలువలు,ఔషధ గుణాలు ఉండుట వలన మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. వాము రుచిలో కాస్త ఘాటుగా ఉంటుంది.

వాములో ఉండే రసాయనాలు జీర్ణ ప్రక్రియలో సహాయపడతాయి. ప్రతి రోజు వామును తీసుకోవటం వలన మన శరీరంలో ఎలాంటి మార్పులు కలుగుతాయి. ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో వివరంగా తెలుసుకుందాం.

ఈ ఆర్టికల్ చూసాక వామును ఇష్టపడని వారు కూడా వామును తీసుకోవటం అలవాటు చేసుకుంటారు. ప్రతి రోజు క్రమం తప్పకుండా ఒక స్పూన్ వామును తీసుకుంటే ఎన్నో ఆరోగ్య సమస్యల నుండి బయట పడవచ్చు. ప్రతి రోజు ఒక గ్లాస్ నీటిలో ఒక స్పూన్ వాము కలిపి తీసుకుంటే ఇన్ ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. అలాగే అధిక బరువు ఉన్నవారికి వాము ఒక దివ్య ఔషధం అని చెప్పవచ్చు. వాములో ఉన్న గుణాలు శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తొలగించటంలో సహాయపడుతుంది.

శరీరంలో కొవ్వు తొలగిపోతే ఆటో మెటిక్ గా బరువు తగ్గుతారు. వాము యాంటీ సెప్టిక్ గా పనిచేస్తుంది. వాములో ఉండే థైమిన్ అనే రసాయనం యాంటీ బ్యాక్టీరియల్ గా పనిచేసి ఫంగల్ ఇన్ ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. వాములో పీచు పదార్ధం,ఖనిజాలు,విటమిన్స్,యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి.

జలుబు,అలసట,తలనొప్పి వంటి ఆరోగ్య సమస్యలకు మంచి పరిష్కారం అని ఆయుర్వేదం చెప్పుతుంది.సాధారణంగా గర్భిణీ స్త్రీలలో ఆకలి మందగించటం,తిన్న ఆహారం సరిగా జీర్ణం కాకపోవటం వంటి సమస్యలు ఉంటాయి. అలాంటి సమయంలో కొంచెం వామును తీసుకుంటే ఆ సమస్యలు తీరటమే కాకుండా జీర్ణ సంబంధ సమస్యలు కూడా తొలగిపోతాయి. గర్భిణీ స్త్రీలలో ఉండే మలబద్దకం సమస్య కూడా తగ్గిపోతుంది.

కడుపునొప్పి వచ్చినప్పుడు అరస్పూన్ వాములో చిటికెడు ఉప్పు కలిపి తీసుకుంటే వెంటనే కడుపునొప్పి తగ్గిపోతుంది. కడుపు నొప్పి వచ్చినప్పుడు వాము తీసుకోవటం వలన కడుపులో గ్యాస్,ఎసిడిటిని తగ్గించి కడుపునొప్పి తగ్గేలా చేస్తుంది. అజీర్ణంతో బాధపడేవారు ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ వామును కలిపి త్రాగాలి.

అలాగే వేడి వేడి అన్నంలో కొంచెం వామును కలిపి తిన్నా అజీర్తి సమస్య నుండి బయట పడవచ్చు. ఈ రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కీళ్ల నొప్పులతో బాధ పడుతున్నారు. అటువంటి వారు వాము నుంచి తీసిన నూనెను నొప్పులు ఉన్న ప్రదేశంలో రాసి 5 నిముషాలు మసాజ్ చేయాలి. ఈ విధంగా కొన్ని రోజుల పాటు చేస్తూ ఉంటే క్రమంగా కీళ్ల నొప్పులు తగ్గిపోతాయి.

ప్రతి రోజు ఒక స్పూన్ వామును తీసుకోవటం వలన జీర్ణ సమస్యలు తొలగిపోవటమే కాకుండా రక్తంలో కొలస్ట్రాల్ కూడా తొలగిపోతుంది. రక్తంలో కొలస్ట్రాల్ తొలగిపోవటం వలన గుండెకు రక్త సరఫరా మెరుగుపడి గుండెకు సంబందించిన సమస్యలు రావు.

చూశారుగా ఫ్రెండ్స్ మన ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండే వామును తీసుకోవటం వలన ఎన్ని ఆరోగ్య ప్రయోజనలు పొందవచ్చో తెలుసుకున్నారుగా. మీరు కూడా ప్రతి రోజు వామును తీసుకొని ఈ ఆరోగ్య ప్రయోనాలను పొందండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.