Kitchenvantalu

Useful Kitchen Tips: ప్రతి ఇల్లాలి కోసం వంటింటి చిట్కాలు.. తప్పక తెలుసుకుని పాటించండి..!

Useful Kitchen Tips: ప్రతి ఇల్లాలి కోసం వంటింటి చిట్కాలు.. తప్పక తెలుసుకుని పాటించండి.. వంటింటిలో కొన్ని చిట్కాలను ఫాలో అయితే వంట త్వరగా అవుతుంది. అలాగే కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి. ఇక ఆ చిట్కాల గురించి తెలుసుకుందాం.

చపాతీ పిండిలో నీళ్ళకు బదులు కొబ్బరి నీళ్లను పోసి కలిపితే చపాతీలు రెండు రోజులపాటు తాజాగా ఉంటాయి. అలాగే మెత్తగా మృదువుగా ఉంటాయి.

మిగిలిపోయిన చపాతీ పిండి ముద్దను తడి గుడ్డలు చుట్టి పెడితే మరుసటి రోజుకి కూడా పొడిగా లేకుండా తేమగా ఉంటుంది.

చపాతీ పిండి పీటకు అతుక్కుని రాకపోతే పీఠను రెండు నిమిషాలు ఫ్రిజ్లో పెడితే అతుక్కున పిండి సులభంగా వస్తుంది. ఈ విధంగా మనలో చాలా మందికి అనుభవమే. కాబట్టి ఈ చిట్కా చాలా బాగా సహాయపడుతుంది.

ఆకుకూరలు తొందరగా వడిలిపోటు ఉంటాయి. తోటకూరను అల్యూమినియం ఫైల్ లో చుట్టి ఫ్రిజ్లో పెడితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది.

ఇడ్లీ దోశ పిండి ల మీద ఒక తమలపాకు వేస్తే పిండి మూడు రోజులపాటు పులవకుండా తాజాగా ఉంటుంది.

పచ్చి అప్పడాలు తాజాగా విరిగిపోకుండా ఉండాలంటే వాటిని కాగితం లో పెట్టి బియ్యం లేదా పప్పు డబ్బాలో పెట్టుకోవాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.