Kitchenvantalu

Adding baking soda:ఇడ్లీ పిండి త్వరగా పులవాలని వంట సోడా కలుపుతున్నారా..

Adding baking soda:ఇడ్లీ పిండి త్వరగా పులవాలని వంట సోడా కలుపుతున్నారా..అయితే జాగ్రత్త… దోశ, ఇడ్లీ పిండి తొందరగా పులిసేలా చేయటానికి మనలో చాలామంది బేకింగ్ సోడా లేదా వంట సోడా వేస్తూ ఉంటారు. ఇలా సోడా వేయడం వలన తొందరగా పిండి పులుస్తుంది. హోటల్స్ లో ఎక్కువగా ఇలానే చేస్తూ ఉంటారు.ఎక్కువగా వంట సోడా తీసుకోవడం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయి.

వంట సోడాలో ఉండే సోడియం బై కార్బోనేట్ రక్తపోటు పెరగడానికి దోహదపడుతుంది. అలాగే జీర్ణ వ్యవస్థను బలహీన పరుస్తుంది. ప్రతిరోజు వంట సోడా లేదా బేకింగ్ సోడా వాడుతూ ఉంటే కిడ్నీల వైఫల్యం ఎదుర్కో నే పరిస్థితి వస్తుంది. సోడాలో ఉండే పాస్పరిక్ యాసిడ్ పొట్టలోని యాసిడ్ తో కలిసి జీర్ణ సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. అలాగే శరీరం పోషకాలను గ్రహించే సామర్థ్యం దెబ్బతింటుంది

డయాబెటిస్ ఉన్న వారిలో రక్తంలో చక్కెర స్థాయిలు చాలా స్పీడ్ గా పెరిగిపోతూ ఉంటాయి. సోడాలో ఉండే పాస్పరిక్ యాసిడ్ ఎముకలకు నష్టాన్ని కలిగిస్తుంది ఎందుకంటే శరీరం calcium గ్రహించే శక్తి బలహీనం అవుతుంది. దాంతో కీళ్ళనొప్పులు,మోకాళ్ళ నొప్పులు వంటివి వస్తాయి.

అలా సోడా వాడకుండా…సాధారణంగా ఇడ్లీ పిండి దోసెల పిండి పులియాలంటే, పప్పు రుబ్బిన తర్వాత రాత్రంతా పిండిని వదిలేయాలి. అప్పుడే మీ దోసెలు కానీ, ఇడ్లీలు కానీ మంచి మృదువుగాను రుచికరంగాను వస్తాయి. ఈ పిండిని ఫ్రిజ్ లో పెట్టుకుంటే వారం రోజుల వరకు వాడుకోవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.