Kitchenvantalu

Carrot Methi Chutney Recipe: కమ్మని క్యారెట్ మెంతికూర పచ్చడిని ఎప్పుడైనా ఇలా ట్రై చేసారా.. సూపర్ గా ఉంటుంది

Carrot Methi Chutney Recipe: కంటి ఆరోగ్యానికి క్యారెట్ ఎంత ముఖ్యమో, శరీరానికి చలువ చేయడానికి, మెంతి కూడా అంతే అవసరం. క్యారేట్ మేతీని కలిపి,ఒక రుచికరమైన పచ్చడిని చూసేయండి.

కావాల్సిన పదార్ధాలు
తాళింపు కోసం..
నూనె – 2 టేబుల్ స్పూన్స్
జీలకర్ర – 1 టీ స్పూన్
వెల్లుల్లి – 10
పచ్చిశనగపప్పు – 1 టేబుల్ స్పూన్
మినపప్పు – 2 టేబుల్ స్పూన్
ఆవాలు – 1 టీ స్పూన్
ఎండు మిర్చి – 3

పచ్చడి కోసం..
క్యారేట్ తురుము – 250 గ్రాములు
పచ్చిమిర్చి -3
మెంతికూర ఆకులు – 2 చిన్న కట్టలు
నూనె – 2 టీ స్పూన్స్
ఉప్పు – తగినంత
బెల్లం – 1 టీస్పూన్

తయారీ విధానం –
1.స్టవ్ పై బాండీ పెట్టుకుని, నూనె వేసుకుని, అందులోకి జీలకర్ర, వెల్లుల్లి, శనగపప్పు, మినపప్పు, ఆవాలు వేసుకుని, వేగనివ్వాలి.
2. తాళింపులు వేగాక బరకగా గ్రైండ్ చేసి పెట్టుకోండి.
3. క్యారేట్ తురుము, పచ్చిమిర్చి వేసుకుని, మిక్సీ జార్లోకి తీసుకోండి.

4. ఇప్పుడు అదే బాండీలోకి కొద్దగా ఆయిల్ వేసి, మెంతికూరను కూడా వేపుకోవాలి.
5. మిక్సీలో వేసుకున్న క్యారేట్ తురుము, వేపిన మెంతికూర, గ్రైండ్ చేసుకున్న తాలింపు, ఉప్పు, బెల్లం, అన్ని కలిపి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి.
6. ఇందులోకి అవసరం అయితే కొద్దిగా, చింతపండును, కలుపుకోండి.
7. గ్రైండ్ చేసుకున్న పచ్చడిలోకి తాళింపు వేసుకుంటే క్యారేట్ మేతి పచ్చడి రెడీ అయినట్లే..