Kitchenvantalu

Ganji Annam Recipe:వందల రోగాలని నయం చేసే గంజి అన్నం

Ganji Annam Recipe: బియ్యం నుండి తీసిన నీళ్లు,అన్నం నుండి వార్చిన గంజి ఎంత ఆరోగ్యమో అందరికి తెల్సిందే. ఆ గంజిలో కాసింత అన్నం,మజ్జిగ వేసి రాత్రంత పులియపెట్టి తిన్నారంటే రోగాలు మీ దరిచేరవంటే నమ్మండి.

కావాల్సిన పధార్ధాలు
బియ్యం- 1 కప్పు
నీళ్లు – 4 కప్పులు
మజ్జిగ- 2 కప్పులు
వాము – 2 చిటికెల్లు
ఉప్పు – రుచికి సరిపడా
ఉల్లిపాయ – 1
పచ్చిమిర్చి – 2
నీళ్లు – ½ లీటర్

తయారి విధానం
1.కడిగి నానబెట్టిన బియ్యంలో కప్పుకి నాలుగు కప్పుల నీళ్లు పోసి అన్నాన్ని మెత్తగా వండి గంజి వార్చుకోవాలి.
2.గంజి చల్లారనివ్వాలి.
3.చల్లారిన అన్నంలో ,చల్లారిన గంజి తో పాటు ,మజ్జిగ మిగిలిన పధార్ధాలన్ని వేసి కలిపి మూత పెట్టి రాత్రంత పులియనివ్వాలి.
3.తెల్లారక మరో సారీ కలిపి ఉల్లిపాయ,పచ్చిమరిచ్చి నంజుకుంటు తింటే రుచి అదిరిపోతుంది.