Kitchenvantalu

Baby Corn Coriander Bullets:సాయంత్రం స‌మ‌యంలో ఇలా వేడిగా చేసి తినండి.. ఎంతో టేస్టీగా ఉంటాయి..!

Baby Corn Coriander Bullets Recipe: సాయంత్రం స‌మ‌యంలో ఇలా వేడిగా చేసి తినండి.. ఎంతో టేస్టీగా ఉంటాయి..! ఫాస్ట్ ఫుడ్స్, చైనీస్ ఫుడ్స్, ఈరోజుల్లో ఫ్యాషన్ గా మారిపోయాయి. అలాంటి ఫాస్ట్ ఫుడ్ కు అలవాటు పడ్డవారికి రుచిలో ఏమాత్రం తగ్గకుండా, బేబీ కార్న్ బుల్లెట్స్ ట్రై చేసి పెట్టండి. చైనీస్ ఫుడ్ తిన్నట్లుగానే ఉంటుంది.

కావాల్సిన పదార్థాలు
కార్న్ కోటింగ్ , ఫ్రై చేయడానికి
బేబీ కర్న్ – 200 గ్రాములు
పసుపు – కొద్దిగా
మైదా – 2 టేబుల్ స్పూన్స్
కార్న్ ఫ్లోర్ – 2 టేబుల్ స్పూన్స్
ఉప్పు- తగినంత
కొత్తిమీర తరుగు – కొద్దిగా
నూనె – డీప్ ఫ్రైకి సరిపడా

కార్న్ టాసింగ్ కోసం..
నూనె – 2 టేబుల్ స్పూన్స్
ధనియాలు – 2 టేబుల్ స్పూన్స్
వెల్లుల్లి తరుగు – 2 టీ స్పూన్స్
సన్నని పచ్చిమిర్చి – 2 టేబుల్ స్పూన్స్
టమాటో కెచప్ – 1 టేబుల్ స్పూన్స్
కారం – 1 స్పూన్
ఉప్పు – కొద్దిగా
చాట్ మసాలా – 1 టీ స్పూన్
గరం మసాల – 1/2టీస్పూన్
కొత్తిమీర తరుగు – 1 కప్పు
నిమ్మరసం – 1 స్పూన్

తయారీ విధానం
1.ఒక గిన్నెలోకి నీళ్లు పోసి, పసుపు వేసి, బేబీ కార్న్ వేసుకుని, 60 శాతం ఉడికించాలి.
2.ఉడికిన కార్న్ వడ కట్టి, చల్లని నీళ్లలో వేసి, 5 నిముషాలు తర్వాత బయటికి తీసి, 1.5 ఇంచ్ ముక్కలుగా కోసి, తడి ఆరే వరకు ఆరుబెట్టుకోవాలి.
3.ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ లో , మైదా, కార్న్ ఫ్లోర్, కొత్తిమీర, వేసుకుని, బేబీ కార్న్ ముక్కలను వేసి , పిండి వాటికి పట్టుకునేలా కలుపుకోవాలి.
4. ఇప్పుడు బాగా వేడెక్కిన నూనెలో కార్న్ వేసి, ఎర్రగా వేపుకుని, జెల్లెడలో తీసిపెట్టుకోవాలి.

5. ఇప్పుడు టాసింగ్ కోసం ఒక పాన్ వేడ చేసి, అందులోకి నూనె వేసి దంచిన ధనియాలు, వెల్లుల్లి, మిర్చి, వేసుకుని, హై ఫ్లైమ్ పై టాస్ చేసుకోవాలి.
6. తర్వాత టామాటో కెచప్, ఉప్పు, కారం, చాట్ మసాలా, తగినన్ని నీళ్లు పోసి కలపాలి.
7. ఇప్పుడు కాస్త నీరు ఉండగానే, వేపి పెట్టుకున్న కార్న్ ముక్కలు, గరం మసాల, కొత్తిమీర తరుగు, నిమ్మసరం పిండి, హై ఫ్లేమ్ పై టాస్ చేసుకుని, స్టవ్ ఆఫ్ చేయాలి.
8. అంతే .. బేబీ కార్న్ కొత్తిమీర బుల్లెట్స్ రెడీ అయినట్లే.