Kitchenvantalu

Kaju Curry: ధాబా స్టైల్‌లో జీడిప‌ప్పు మ‌సాలా క‌ర్రీ.. ఇలా చేయాలి..

Kaju Curry: ధాబా స్టైల్‌లో జీడిప‌ప్పు మ‌సాలా క‌ర్రీ.. ఇలా చేయాలి.. జీడిపప్పు అంటే, వంటకాల్లో స్వీట్స్ లో, కేక్స్ లో డెకరేషన్ గా , వేస్తుంటాం. కాని జీడిపప్పులతో చేసిన, ఏ స్పెషల్ అయినా, రుచిలో అమోఘమే. అలాంటి జీడిపప్పులతో కర్రి చేస్తే, అదేనండీ ఫంక్షన్స్ లో కనిపించే టేస్టీ కాజూ కర్రీ ఎలా చేయాలో తెల్సుకుందాం.

కావాల్సిన పదార్ధాలు
జీడిపప్పు – 150 గ్రాములు
నెయ్యి – 2 టీ స్పూన్స్
నూనె – 2 స్పూన్స్

గ్రేవీ కోసం
జీడిపప్పు – 20
బాదం – 5
కర్బూజ గింజలు – 1 టేబుల్ స్పూన్
ఉల్లిపాయ -1
దాల్చిన చెక్క – 1 ఇంచ్
మిరియాలు – 1/2టీ స్పూన్
యాలకులు – 4
లవంగాలు -2
పెరుగు – 1/3కప్పు
నీళ్లు – 300ml
పచ్చిమిర్చి -1

కర్రీ కోసం
నెయ్యి – 2 టీ స్పూన్స్
బిర్యాని ఆకు – 1
లవంగాలు -2
యాలకులు -4
దాల్చిన చెక్క – 1 ఇంచ్
అల్లం వెల్లుల్ల పేస్ట్ – 1 టీ స్పూన్
నీళ్లు – 1/2లీటర్
కసూరి మేథి – ½ టీ స్పూన్
చక్కెర – ½ టీ స్పూన్
కొత్తిమీర – కొద్దిగా
పన్నీర్ – 100 గ్రాములు
ఫ్రెష్ – 2 టీ స్పూన్స్
బటర్ – 1 టేబుల్ స్పూన్

తయారీ విధానం
స్టవ్ పై పాన్ పెట్టుకుని, నెయ్యి , నూనె వేసి అందులో , జీడిపప్పులు వేసుకుని, వేపుకుని, పక్కన పెట్టుకోండి. అదే పాన్ లోకి , గ్రేవీ కోసం తయారు చేసుకున్న మసాలా ధీనుసులు, ఉల్లిపాయలు వేసి, దోరగా వేపుకోవాలి. అందులోకి బాదం, కర్బూజ గింజలు, జీడిపప్పు వేసి, ఒక నిముషం వేపుకోని మూత పెట్టి, జీడిపప్పు మెత్తపడే వరకు ఉడికించుకుని దించేయాలి.

ఉడకిన జీడిపప్పును మిక్సీజార్ లోకి వేసుకుని, అందులోకి పెరుగు, పచ్చిమిర్చి వేసి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. ఇప్పుడు పాన్ లోకి నెయ్యి వేసి అందులో దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యాని ఆకు, అల్లం వెల్లుల్లి వేసి వేపుకోవాలి. వేగిన తర్వాత జీడిపప్పు పేస్ట్ వేసి, నీళ్లు పోసి , నలిపిన కసూరి మేతి, పంచదార వేసి , రుచికి సరిపడా ఉప్పు వేసి, కలుపుతూ 15 నిముషాలు దగ్గర పడనివ్వాలి.

ఇప్పుడు గ్రేవీ కాస్త చిక్క పడ్డాక, ముందుగా వేపుకున్న జీడిపప్పు క్రీమ్, బటర్, వేసి1 నిముషం ఉడికించాలి. స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు కొత్తిమీర తరుగు పై పైన చల్లుకుని, పన్నీర్ తురుము వేసుకుని సెర్వ్ చేసుకోవడమే.