Kitchenvantalu

Instant Ragi Dosa Recipe : దోశలు తినాల‌ని ఉందా.. రాగి దోశ‌లను ఇన్‌స్టంట్‌గా అప్ప‌టిక‌ప్పుడు ఇలా వేసుకోవ‌చ్చు..

Instant Ragi Dosa Recipe :బిజీ బిజీ లైఫ్ లో, వంటల కోసం ఎక్కువ టైమ్ స్పెండ్ చేయలేం. అలాగే ఆరోగ్యాన్ని అశ్రద్ద చేయలేం. అలా బిజీ షెడ్యూల్ మరి, హెల్త్ కాన్సియస్ ఉన్నవాళ్లకి, రాగి దోశ పర్ఫెక్ట్ బ్రేక్ ఫాస్ట్. రాత్రంతా ఉడకపెట్టి, మిక్సీ పట్టి, గ్రైండ్ చేసేంత టైమ్ లేని వాళ్లు అరగంటలో, టిఫిన్ తయారు చేసుకోవచ్చు.

కావాల్సిన పదార్థాలు
రాగి పిండి – 1 కప్పు
బియ్యం పిండి – 2 టేబుల్ స్పూన్స్
ఎండుమిర్చి – 5
సోంపు – 1 టీ స్పూన్
ఉల్లిపాయ తరుగు – 1/3కప్పు
ఉప్పు – తగినంత
కొత్తిమీర – కొద్దిగా
నూనె – సరిపడా

తయారీ విధానం
1.ఒక మిక్సీ జార్ లోకి ఎండుమిర్చి, సోంపు వేసి, మెత్తని పౌడర్ లా చేసుకోవాలి.
2.వేరొక మిక్సీ బౌల్ లోకి రాగిపిండిని తీసుకుని, ఎండుమిర్చి, సోంపు పోడర్ను వేసుకుని, అందులోకి ఉల్లిపాయ తరుగు, కొత్తిమీర, బియ్యం పిండి, తీసుకుని అట్లపిండిలా జారుగా కలుపుకుని, అరగంటపాటు అక్కడే పెట్టుకోవాలి.

3.స్టవ్ పై దోశ పాన్ పెట్టుకుని, బాగా వేడెక్కిన తర్వాత, దోశలు వేసుకుని, అంచులకు, నూనె వేయాలి.
4.ఒక వైపు కాలిన తర్వాత మరో వైపుకు తిప్పుకుని, రెండు వైపులా దోరగా కాల్చుకుని సెర్వ్ చేసుకోవాలి.
5.అంతే రాగి దోశ రెడీ.