Kitchenvantalu

Onion Pakodi Recipe:స్వీట్ షాప్ స్టైల్లో కరకరలాడే గట్టి పకోడీ ఒక్కసారి చేస్తే 15రోజులు తినొచ్చు

Onion Pakodi: చల్ల చల్లని వాతవరణంలో వేడి వేడి టీ తాగుతు కర కర లాడే పకోడిని తింటుంటే ఆ మజానే వేరు. అచ్చం స్ట్రీట్ ఫుడ్ స్టైల్లో ఉల్లిపాయ పకోడి ఎలా చేయాలో చూసేద్దాం.

కావాల్సిన పదార్ధాలు
ఉల్లిపాయలు – 300 గ్రాములు
పచ్చిమిర్చి – 2
కారం – 1 టేబుల్ స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టేబుల్ స్పూన్
జీలకర్ర – 1 టేబుల్ స్పూన్
గరం మసాలా – 1 టేబుల్ స్పూన్
ధనియాల పొడి – 1 టేబుల్ స్పూన్
ఉప్పు – రుచికి సరిపడా
శనగపిండి – 1/150 కప్పులు
బియ్యం పిండి – 2 టేబుల్ స్పూన్
నీళ్లు – 1 టేబుల్ స్పూన్
కరివేపాకు – 3 రెమ్మలు
ధనియాలు – 1 టేబుల్ స్పూన్

తయారీ విధానం
1.ఉల్లిపాయలను,పచ్చిమర్చిని సన్నని పొడవు చీలకలుగా కట్ చేసుకోవాలి
2.అందులోకి తీసుకున్న పదార్ధాలన్ని వేసి ఉల్లిపాయలు పిండుతూ కలుపుకోవాలి.
3.తరువాత అందులోకి శనగపిండి,బియ్యం పిండి వేసి ఉల్లిపాయలకు పట్టేలా కలుపుకోవాలి.

4.కలుపుకున్న పిండిలోకి చెంచాడు నీళ్లు ఆడ్ చేసి కాస్త ముద్దగా చేసుకోవాలి.
5.మరిగే నూనెలో పకోడిని విడివిడిగా వేసుకోవాలి.
6.పకోడిని మీడియం ఫ్లేమ్ పై తిప్పుకుంటు ఎర్రగా కాల్చుకోని జల్లి గరిట సాయంతో తీసుకుంటే కర కరలాడే పకోడి రెడీ.