Healthhealth tips in telugu

Avakaya:వేసవిలో ఆవకాయ పచ్చడి ఎక్కువగా తినేస్తున్నారా…ప్రమాదంలో పడినట్టే

Avakaya Side Effects :వేసవికాలంలో మామిడి కాయలు ఎంత ఫేమసొ మామిడి కాయ తో తయారు చేసిన ఆవకాయ పచ్చడి కూడా అంతే ఫేమస్. తెలుగువారు రెండు పూటలా ఆవకాయ వేసుకుని తినమంటే బోర్ కొట్టకుండా తినేస్తారు. అయితే ఇలా ఆవకాయ ఎక్కువగా తింటే మంచిదేనా అనే విషయానికి వస్తే ఆవకాయ ఎక్కువగా తింటే ఎన్నో నష్టాలు ఉన్నాయి

ఆవకాయ వంటి పచ్చడిలో ఉప్పు శాతం ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో సోడియం లెవెల్స్ ఎక్కువ అయిపోతాయి. దాంతో రక్తపోటు సమస్యలు కిడ్నీ సమస్యలు కడుపు ఉబ్బరం .వంటి సమస్యలు వస్తాయి

అలాగే పచ్చడి ఎక్కువరోజులు నిలవ ఉండటానికి ఎక్కువగా నూనె వాడతారు నూనెలో  కొవ్వు ఎక్కువగా ఉండటం వల్ల పెద్ద మొత్తంలో శరీరంలో కొవ్వు  చేరుకుని కొలెస్ట్రాల్ పెరిగి గుండె సమస్యలు వస్తాయి

సోడియం లెవెల్స్ ఎక్కువగా ఉండటం వలన శరీరంలో విషాలు కూడా ఎక్కువగా పెరుగుతాయి అలాగే కిడ్నీ సమస్యలు కూడా వస్తాయి. రాత్రి సమయంలో ఆవకాయ వేసుకుంటే నిద్ర సరిగా పట్టదు

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.