MoviesTollywood news in telugu

Meera Chopra: పవన్ హీరోయిన్ ని గుర్తు పట్టారా…ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా ?

Meera Chopra: :ఉత్తరాది నుంచి చాలామంది హీరోయిన్స్ దక్షిణాదికి అందునా టాలీవుడ్ కి ఎంటర్ అవుతూనే ఉన్నారు. కొందరు ఎక్కువకాలం ఇక్కడే ఉంటే, మరికొందరు కొన్ని సినిమాలతోనే దూరం అవుతున్నారు. అందులో బాలీవుడ్ నుంచి వచ్చిన మీరా చోప్రా ఒకరు.

ఈమె ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రాకి దగ్గర బంధువే.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన బంగారం మూవీలో సంధ్యా రెడ్డి పాత్రలో నటించడమే కాకుండా నాగార్జున, నితిన్ ,తదితరుల సరసన నటించింది.

తెలుగు ఆడియన్స్ కి దగ్గరైన మీరా చోప్రా ఆతర్వాత తమిళ,కన్నడ,హిందీ భాషల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఆమె నటించిన మూవీస్ పెద్దగా ఆకట్టుకోకపోవడంతో దూరం అయింది.

ఇక సుమంత్ ఆర్ట్స్ అధినేత ఎమ్మెస్ రాజు డైరెక్టర్ గా చేసిన వాన మూవీలో నటించిన మీరా చోప్రా మంచి నటన కనబరిచింది. అయితే ఈమె నటించిన సినిమాల్లో నటన బాగున్నా సినిమాలు ఆడకపోవడంతో టాలీవుడ్ కి దూరం జరిగింది.

అయితే ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ కి రెడీ అవుతున్నట్లు టాక్. ఈమె తెలుగులో చివరి సారిగా మొగలిపువ్వు మూవీ లో చేసింది. కానీ ఈ మూవీ విడుదల కాలేదు. ఇలా రిలీజ్ కానీ సినిమాలు ఇండస్ట్రీలో చాలానే ఉన్నాయి. మీరా చోప్రా పెళ్లి రక్షిత్ కేజ్రీవాల్ తో మార్చి 12న ఘనంగా జరిగింది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."