Stretch marks:ప్రెగ్నెసీ అనంతరం వచ్చే స్ట్రెచ్ మార్క్స్ పోవాలంటే…!
Stretch marks:ప్రెగ్నెసీ అనంతరం వచ్చే స్ట్రెచ్ మార్క్స్ వల్ల మహిళలు చాలా ఆందోళన చెందుతుంటారు. ఈ మార్క్స్ పూర్తిగా తొలగిపోకున్నా కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా కనిపించకుండా తగ్గించుకోవచ్చు. మరి వాటి గురించి తెలుసుకుందాము.
1. కోకో, బట్టర్ ఉన్న క్రీమ్స్‌ను ఉపయోగించి స్ట్రెచ్ మార్క్స్ ఉన్న చోట నెమ్మదిగా మసాజ్ చేయాలి.
2. స్నానం చేసిన అనంతరం విటమిన్-ఇ ఆయిల్‌ను రాసుకోవాలి. ఒక క్రమపద్ధతిలో మార్క్స్‌పైన మసాజ్ చేయాలి.
3. జింక్ అధికంగా లభించే ఆహారపదార్థాలు తీసుకోవాలి. ఆకుకూరలు, సోయా బీన్స్ స్ట్రెచ్ మార్క్స్‌ను తగ్గిస్తాయి.
4. ఆల్మండ్ ఆయిల్, కొబ్బరి నూనె కలిపి మసాజ్ చేసినట్లయితే మార్క్స్ చాలా వరకు తగ్గుతాయి.
5. కడుపు కండరాలను బిగుతుగా చేసే యోగాసనాలు వేయాలి. నీరు ఎక్కువగా తాగాలి. చర్మం పొడిబారకుండా చూసుకోవడం ద్వారా మార్క్స్‌ను తగ్గించుకోవచ్చు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.