Kitchenvantalu

Radish Paratha Recipe:ముల్లంగి పరాటా ఒక్క సారి చేసి రుచి చూడండి.. చాలా బాగుంటుంది

Radish paratha Recipe:ముల్లంగి పరాటా.. లంచ్ బాక్స్ ,బ్రేక్ ఫాస్ట్ కి పర్ ఫెక్ట్ గా సూటయ్యే రెసిపీ పరాటా. పిల్లలు ,పెద్దలు ఎంతో ఇష్టంగా తినే పరాటాను ముల్లంగి తోటి చేసి చూడండి.

కావాల్సిన పదార్ధాలు
ముల్లంగి – 1
గోధుమ పిండి – 1 కప్పు
శనగ పిండి – 2 టేబుల్ స్పూన్స్
కారం – ½ టీ స్పూన్
ధనియాల పొడి – ½ టీ స్పూన్
ఉప్పు – ½ టీ స్పూన్
పసుపు – ¼ టీ స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ – ½ టీస్పూన్
జీలకర్ర – ½ టీ స్పూన్
వాము – ¼ టీ స్పూన్
పచ్చిమిర్చి – 2
కొత్తిమీర – కొద్దిగా

తయారీ విధానం
1.ముల్లంగిని తొక్క తీసుకోని తురుమి పెట్టుకోవాలి.
2.ఒక గిన్నెలో కప్పు గోధుమ పిండిని వేసి అందులో శనగ పిండి ,కారం,ధనియాల పొడి,ఉప్పు,పసుపు,అల్లం వెల్లుల్లి పేస్ట్,జీలకర్ర,వాము,పచ్చిమిర్చి వేసి ముల్లంగి తురుము కలుపుకోవాలి.
3.కొద్ది కొద్దిగా నీళ్లు వేస్తు పిండి మెత్తగా కలుపుకోని ఒక టీ స్పూన్ ఆయిల్ వేసి పది ,పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకోవాలి.
4.కలుపుకున్న పిండని చిన్న చిన్న బాల్స్ లా తయారు చేసుకోవాలి.
5.పిండి ముద్దను చపాతిల తాల్చుకోని ప్యాన్ పై కాల్చుకోవాలి.
6.అంచులకు నూనె కాని నెయ్యి ని కాని వేసుకోని బ్రౌన్ కలర్ లోకి వచ్చే వరకు కాల్చుకుంటే ముల్లంగి పరాటా రెడీ.