Kitchenvantalu

Rava Burelu Recipe:ఏ పండుగకి అయినా ఈజీగా త్వరగా చేసుకోగలిగే బూరెలు.. సూపర్ గా ఉంటాయి

Rava Burelu Recipe:ప్రసాదం బూరెలు..పండగలు,పూజలు ఉన్నాయంటే స్పెషల్ స్వీట్ రెసిపీస్ కోసం వెతుకుతూ ఉంటాం. ఆంధ్ర మరియు,తెలంగాణ ఫేమస్ బూరెలు ప్రతి ప్రత్యేక సందర్భంలో చేస్తుంటాం. ప్రసాదం బూరెలు ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం.

కావాల్సిన పదార్ధాలు
మినపప్పు – 1 కప్పు
బియ్యం – 1 ½ కప్పు
ఉప్పు – ½ స్పూన్
చక్కెర – 2 స్పూన్స్
ఇడ్లీ రవ్వ – 1 ½ స్పూన్
కేసరి కోసం..
రవ్వ – 1 కప్పు
చక్కెర – 1 ½ కప్పు
డ్రై ఫ్రూట్స్ – తగినన్ని
నెయ్యి – 2టేబుల్ స్పూన్స్
యాలకుల పొడి – ½ టీ స్పూన్

తయారీ విధానం
1.ముందుగా మినపప్పు,బియ్యాన్ని నాలుగు ,ఐదు గంటల పాటు నానబెట్టుకోవాలి.
2.నానిన పప్పు బియ్యాన్ని గ్రైండ్ చేసుకోని పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
3.పిండిలోకి ఉప్పు ,పంచదార,ఇడ్లీ రవ్వ,వేసి కలుపుకోవాలి.
4.పిండి మరీ జారుగా కూడ చేయకూడదు.
5.కేసరికోసం కప్పు రవ్వకి 1 1 /2 కప్పు చక్కెరను తీసుకోవాలి.స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని నెయ్యి వేడి చేసి డ్రై ఫ్రూట్స్ ని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి.

6.అదే ప్యాన్ లోకి ఉప్మా రవ్వను వేసి దోరగా వేపుకోని పక్కన పెట్టుకోండి.
7.ఇప్పుడు సెమోలీనా కోసం ఒక కప్పు రవ్వకి రెండు కప్పుల నీళ్లను వేడి చేసుకోవాలి.
8.నీళ్లు మరుగుతున్నప్పుడు వేయించిపెట్టుకున్న ఉప్మా రవ్వను వేసి ఉండలు లేకుండా కలుపుకోని మూతవేసి ఒక నిమిషం పాటు ఉడకించాలి.
9.రవ్వకాస్త దగ్గరపడ్డాక అందులోకి యాలకుల పొడి కొద్దిగా నెయ్యి ,ఫ్రై చేసిపెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి స్టవ్ ఆఫ్ చేసి కేసరిని చల్లారనివ్వాలి.
10.ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకోని రవ్వ కేసరిని బాల్స్ లా తయారు చేసి రుబ్బుకున్న పిండిలో ముంచి సరిగ్గా కోట్ చేసుకోని నూనె లో వేసుకోవాలి.
11.మీడియం ఫ్లేమ్ పై రెండు,మూడు నిమిషాలు బూరెలను తిప్పుతు ఎర్రగా కల్చుకుని తీసుకోవాలి.
12. అంతే ప్రసాదం బూరెలు రెడీ.