Beauty Tips

Skin Glow Tips:నిగనిగలాడే ముఖం కావాలంటే ఆలివ్ ఆయిల్ ఇలా వాడాల్సిందే

Olive Oil Face Glow Tips: ముఖం అందంగా తెల్లగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దాని కోసం ఎంత ఖర్చు పెట్టటానికి అయినా సిద్దంగా ఉంటారు. బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ సమయాన్ని కూడా వృదా చేస్తూ ఉంటారు.

అలా కాకుండా మన ఇంటిలో ఉండే సహజసిద్దమిన పదార్ధాలతో చాలా సులభంగా చాలా తక్కువ ఖర్చుతో ముఖాన్ని తెల్లగా మెరిసేలా చేసుకోవచ్చు. Olive Oil చర్మ సంరక్షణలో చాలా బాగా సహాయపడుతుంది. Olive Oil ని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.

ప్రతి రోజు రాత్రి పడుకొనే ముందు కొన్ని చుక్కల ఆలివ్ ఆయిల్ తీసుకుని ముఖానికి రాసి రెండు నుండి మూడు నిమిషాల పాటు పై దిశలో మసాజ్ చేయాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటిలో టవల్‌ను ముంచి, అదనపు నీటిని పిండి ముఖంపై ఒక నిమిషం పాటు ఉంచాలి.

ఆ తర్వాత గోరువెచ్చని నీటిలో మళ్లీ టవల్‌ను ముంచి ముఖంపై ఉన్న అదనపు నూనెను తొలగించాలి. ఆ తర్వాత మరొక శుభ్రమైన టవల్‌తో ముఖాన్ని శుభ్రంగా తుడవాలి. ఆలివ్ ఆయిల్ చర్మానికి యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ముడతలను తొలగిస్తుంది.

వృద్ధాప్య లక్షణాలను నివారించటానికి సహాయపడుతుంది. ఆలివ్ ఆయిల్ స్కిన్ డ్యామేజ్ రిపేర్ చేస్తుంది. చర్మానికి పోషణ అందిస్తుంది. olive oil online store లోను, మెడికల్ షాప్స్ లోను సూపర్ మర్కెట్స్ లోను చాలా సులభంగా అందుబాటులో ఉంటుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.