Beauty Tips

Hair Fall Tips:జుట్టు ఊడిపోయి బట్టతల వస్తోందా? ఈ ఆకులతో ఇలా చేస్తే సమస్యకు చెక్

Guava Leaves for Hair Growth : జుట్టుకి సంబందించిన సమస్యలను తగ్గించటానికి జామ ఆకు చాలా బాగా సహాయపడుతుంది. జుట్టు సమస్యలకు ఎన్నో రకాల కారణాలు ఉంటాయి. జుట్టు రాలే సమస్యకు పోషకాహార లోపం,టెన్షన్,ఒత్తిడి వంటి ఎన్నో రకాల కారణాలు ఉంటాయి.

ప్రస్తుతం మారిన జీవనశైలి పరిస్థితులకు వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిలోనూ జుట్టు రాలే సమస్య ఎక్కువ అవుతుంది. మనలో చాలా మంది ఏదో ఒక సమయంలో జుట్టు రాలే సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. జుట్టు రాలే సమస్య ప్రారంభం కాగానే చాలా మంది కంగారు పడిపోతూ మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ కొంటు వేలకు వేలు డబ్బులు ఖర్చు పెట్టేస్తుంటారు.

అయినా ఫలితం తాత్కాలికంగా మాత్రమే ఉంటుంది. అదే ఇంటి చిట్కాలను పాటిస్తే సమస్య తగ్గడమే కాకుండా శాశ్వత పరిష్కారం దొరుకుతుంది.జుట్టు రాలే సమస్య ఉన్న వారిలో చుండ్రు కూడా ఒక కారణం అవుతుంది. తలపై చర్మం పొడిబారి నప్పుడు చుండ్రుగా మారుతుంది. అప్పుడు జుట్టు కుదుళ్ళు బలహీనపడి జుట్టు రాలుతుంది.

ఇప్పుడు మనం చెప్పుకునే రెమిడీ చాలా పర్ఫెక్టుగా పని చేస్తుంది. చుండ్రు వల్ల తలలో దురద కూడా ప్రారంభమవుతుంది. ఈ చిట్కా చుండ్రును తగ్గించడమే కాకుండా దురద వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది అంతే కాకుండా జుట్టు రాలే సమస్యకు మంచి పరిష్కారం చూపుతుంది. దీని కోసం మనం కేవలం మూడే మూడు ఇంగ్రీడెంట్స్ ఉపయోగిస్తాం.

ఒక గిన్నెలో మూడు శీకాయలను చితక్కొట్టి గింజలు తీసి వేయాలి. ఆ తరువాత 7 లేదా 8 కుంకుడు కాయలను చితక్కొట్టి గింజటు తీసి వేయాలి. ఆ తరువాతా 3 జామ ఆకులను చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఆ తరువాత నీటిని పోసి పొయ్య మీద పెట్టి 7 నుంచి 8 నిమిషాల వరుకు మరిగించాలి.

మరిగిన నీరు గోరువెచ్చగా ఉన్నప్పుడూ ఆ నీటితో తల రుద్దుకోవాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తుంటే జుట్టు రాలే సమస్య క్రమంగా తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.