Beauty Tips

White Hair Turn Black:తెల్ల జుట్టు నల్లగా మారడానికి మీ ఇంట్లోనే చక్కని పరిష్కారం

White Hair Turn Black: మారిన జీవనశైలి,ఒత్తిడి,జుట్టుకి సరైన పోషణ చేయకపోవటం, రసాయనాలు ఎక్కువగా ఉన్న ఉత్పత్తులను వాడటం వంటి అనేక రకాల కారణాలతో జుట్టు సంబందించిన సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి.

ముఖ్యంగా చాలా చిన్న వయస్సులోనే తెల్ల జుట్టు సమస్య వస్తుంది. తెల్లజుట్టు సమస్య రాగానే అసలు కంగారు పడవలసిన అవసరం లేదు. మన ఇంటిలో సహజసిద్దంగా దొరికే కొన్ని పదార్ధాలను ఉపయోగించి చాలా సులభంగా తెల్లజుట్టును నల్లగా మార్చుకోవచ్చు.

తెల్లజుట్టును నల్లగా మార్చటంలో bhringraj చాలా బాగా సహయాపడుతుంది. Bhringraj మూలికలలో చాలా ప్రసిద్ది చెందింది. జుట్టుకి అవసరమైన పోషణ అందించి తెల్లజుట్టును నల్లగా మార్చుతుంది. ఒత్తిడి తగ్గించి తెల్లజుట్టు సహజంగా నల్లగా మారేందుకు సహాయపడుతుంది.

పొయ్యి మీద పాన్ పెట్టి నాలుగు స్పూన్ల కొబ్బరి నూనె, ఒక స్పూన్ Bhringraj వేసి బాగా మరిగించాలి. చల్లారిన తర్వాత వడకట్టి…ఈ నూనెను జుట్టుకు పట్టించి అరగంట అయ్యాక తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే మంచి పలితం వస్తుంది.

Bhringraj పొడిని పురాతన కాలం నుండి జుట్టు సంరక్షణలో ఉపయోగిస్తున్నారు. కాస్త శ్రద్ద,సమయాన్ని కేటాయిస్తే చాలా తక్కువ ఖర్చులో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తెల్లజుట్టును నల్లగా మార్చుకోవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.