Beauty Tips

White Hair Turn Black: తెల్ల జుట్టును న‌ల్ల‌గా మార్చే స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కా..

White Hair Turn Black:తెల్లజుట్టు సమస్య రాగానే అసలు కంగారు పడవలసిన అవసరం లేదు. తెల్లజుట్టు రావటం ప్రారంభం అయినా వెంటనే ఇంటి చిట్కాలను ఫాలో అయితే చాలా త్వరగా తెల్లజుట్టును నల్లగా మార్చుకోవచ్చు.

ఉల్లిపాయ,నిమ్మకాయ తెల్లజుట్టును నల్లగా మార్చటంలో సహాయపడతాయి. ఉల్లిపాయను జుట్టు సంరక్షణలో చాలా పురాతన కాలం నుండి ఉపయోగిస్తున్నారు. ఉల్లిపాయ రసంలో క్వెర్సెటిన్ మరియు విటమిన్ సి వంటి యాంటీ ఆక్సిడెంట్లు సమృద్దిగా ఉండుట వలన తెల్లజుట్టును నల్లగా మార్చుతుంది.

అలాగే తెల్లజుట్టు రాకుండా కూడా చేస్తుంది. జుట్టు రాలే సమస్యను తగ్గించటంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. అలాగే జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఒక బౌల్ లో మూడు స్పూన్ల ఉల్లి రసం, రెండు స్పూన్ల నిమ్మ రసం వేసి బాగా కలపాలి.

ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకు పట్టించి గంట అయ్యాక తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే తెల్లజుట్టు సమస్య నుండి బయట పడవచ్చు.

ఉల్లిపాయ,నిమ్మకాయలో ఉన్న పోషకాలు జుట్టు రాలే సమస్య, తెల్లజుట్టు సమస్య, చుండ్రు వంటి అన్ని రకాల సమస్యలను తగ్గించటంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ రెండు ఇంగ్రిడియన్స్ మనకు సులభంగానే అందుబాటులో ఉంటాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.