Healthhealth tips in telugu

Mushrooms:పుట్ట గొడుగులు(మష్రుమ్స్) తింటున్నారా …ఈ నిజాన్ని తెలుసుకోండి

Mushroom health benefits in telugu : పుట్ట గొడుగులు(మష్రుమ్స్) అనేవి ఒకప్పుడు చాలా తక్కువగా లభించేవి. ప్రస్తుతం అన్నీ చోట్ల విరివిగా లభిస్తున్నాయి. సూపర్ మార్కెట్స్, కూరగాయల SHOPలలోనూ విరివిగా లభిస్తున్నాయి. మష్రూమ్స్ తో అనేక రకాల వంటలను చేసుకోవచ్చు.

ఇతర కూరగాయలతో పోలిస్తే పుట్ట గొడుగులు కాస్త ఖరీదు ఎక్కువగా ఉంటాయి. అలాగని కొనటం మానివేయకండి. ఎందుకంటే… వీటిలో పోషకాలు ఎక్కువ. నలబైకి పైబడిన మహిళలు మాంసాహారానికి బదులుగా ఒక కప్పు మష్రుమ్స్ తింటే చాలా మేలు జరుగుతుంది.

తరచూ మష్రుమ్స్ తినటం వలన శరీరానికి సరిపడా విటమిన్ డి అందుతుంది. రోగ నిరోధకశక్తి వృద్ది చెందుతుంది.

వీటిల్లో విటమిన్ బి సమృద్దిగా ఉంటుంది. రిబో ఫ్లేవిన్,నియాసిన్ వంటి పోషకాలు అందాలంటే వీటిని తప్పకుండా తినాలి. రిబో ఫ్లేవిన్ ఎర్ర రక్త కణాలను పెరిగేలా చేస్తుంది. నియాసిన్ చర్మానికి మేలు చేస్తుంది. జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.

పుట్టగొడుగుల్లో ఉండే ఖనిజాలు నాడి వ్యవస్థను దృడంగా ఉంచటంలో కీలకపాత్ర పోషిస్తుంది. దాంతో పాటు హార్మోన్ల అసమానతలను తగ్గిస్తుంది.

వీటిలో లభించే సెలీనియం యాంటిఆక్సి డెంట్ లా పనిచేస్తుంది. శరీరంలోని మృత కణాలను తొలగించి కొత్త కణాల వృద్దికి సహాయపడుతుంది.

మష్రుమ్స్ లో ఉండే రాగి శరీరానికి అవసరమైన ప్రాణ వాయువును అందేలా చేస్తుంది. అలాగే ఎముకలు బలంగా ఉండేలా చేస్తుంది.

మష్రుమ్స్ లో ఉండే పొటాషియం అధిక రక్తపోటును అదుపులో ఉంచటానికి సహాయపడుతుంది. కండరాలను ఉత్తేజితం చేస్తుంది.

బరువు తగ్గాలని అనుకునే వారు వీటికి ప్రాదాన్యత ఇవ్వాలి. దీనిలో కేలరీలు,కొవ్వు తక్కువగా ఉంటాయి. వీటిని తింటే శరీరానికి శక్తి మాత్రమే వస్తుంది. వీటిని కూరల్లో తినటానికి ఇష్టపడకపోతే సూప్ లో వేసుకొని తినవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.