Beauty Tips

Face Tips:ముఖం కాంతివంతంగా మారటానికి బ్యూటీ చిట్కాలు

గులాబీ పెదవుల కోసం…
గులాబి రేకులు, తేనె కలిపి మెత్తని పేస్టులా చేయాలి. ఆ పేస్టుని పెదవులపై రాసుకుని 20 నిమిషాల తరువాత కడిగేసుకోవాలి. ఇలా కొన్ని రోజుల పాటు చేస్తూ ఉంటే పెదవులు గులాబీ రంగులోకి మారతాయి.

మచ్చల నివారణకు
చర్మంపై తేనే రాయటం వలన చర్మం పైన ఉండే మచ్చలకు, మొటిమలకు మంచి ఔషదంగా పనిచేస్తుంది. తేనెలో ‘యాంటీ-బ్యాక్టీరియా’ గుణాలు ఉన్నాయి. చర్మంను సున్నితంగా,మృదువుగా మారుస్తుంది.

కీరా దోశ కంటి కింద నల్లటి వలయాలను తొలగిస్తుంది.
ఆలివ్ ఆయిల్ ని ముఖానికి రాసి రెండు నిమిషాల పాటు మసాజ్ చేస్తే ముఖం మీద ఉన్న మురికి,దుమ్ము ధూళి తొలగిపోతుంది.

ముఖం కాంతివంతంగా మారాలంటే
టమోటాని ఉడికించి రసాన్ని తీయాలి. ఈ రసాన్ని ముఖానికి పట్టించి ముఖాన్ని కడగాలి. ఈ విధంగా కొన్ని రోజుల పాటు చేస్తూ ఉంటే ముఖం కాంతివంతంగా మెరుస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.