Healthhealth tips in telugu

ALLOut, GOOD night లేకుండా ఒక్క నిమిషంలో దోమలు పారిపోయే అద్భుతమైన చిట్కా గురించి తెలుసుకోండి

ALLOut, GOOD night ఇలా రక రకాల పేర్లతో మార్కెట్లో లభించే దోమల నివారణ మందులను దీర్ఘకాలంగా వాడడం వల్ల శ్వాసకోస వ్యాధులు, మానసిక వ్యాధులు తలెత్తే ప్రమాదం ఉంది. దోమ కాటు వలన దురద మరియు శరీరం పైన దద్దురులు వస్తాయి. కొన్ని సందర్భాలలో ఈ కాట్లు మచ్చలలాగా ఏర్పడతాయి.

అందుకే సహజ సిద్ధమైన మార్గాల్లో మాత్రమే దోమలపై యుద్ధం చేయడమే మంచిది. ఇప్పుడు ఒక అద్భుతమైన చిట్కా గురించి తెల్సుకుందాం. ఈ చిట్కా కోసం 5 ఇంగ్రిడియన్స్ అవసరం అవుతాయి. వేపాకులు 50 గ్రాములు తీసుకొని మెత్తని పొడిగా చేసుకోవాలి. 50 గ్రాముల వెలుల్లి తొక్కలను బాగా ఎండబెట్టి పొడిగా చేసుకోవాలి.

లాంగ్ పెప్పర్ 2, 25 గ్రాముల లవంగాలు,పలావ్ ఆకులూ రెండింటిని తీసుకోని మెత్తని పొడిగా గ్రైండ్ చేసుకోవాలి. వేపాకుల పొడి,వెల్లుల్లి తొక్కల పొడి,లవంగం,పెప్పర్,పలావ్ ఆకుల పొడి అన్నింటిని బాగా కలిపి నీటిని చేర్చుతూ మెత్తని పేస్ట్ గా తయారుచేయాలి.

ఈ పేస్ట్ ని చిన్న చిన్న దిమ్మలుగా చేయాలి. వీటిని మూడు గంటల పాటు ఆరబెట్టాలి. బాగా ఆరాక గాలి చొరబడని డబ్బాలో వేసి నిల్వ ఉంచుకోవాలి. దోమలు ఉన్న ప్రదేశంలో ఒక దిమ్మను పెట్టి వెలిగిస్తే ఆ పొగకు దోమలు పారిపోతాయి. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.