Healthhealth tips in telugu

Dhaniyalu:వీటిని మిక్సీ చేసి వంటల్లో వేస్తే ఊహించని ఎన్నో ప్రయోజనాలు…అసలు నమ్మలేరు

Dhaniyalu uses in telugu :సాధారణంగా ధనియాలు తెలియని తెలుగు వారు ఉండరంటే అతిశయోక్తి లేదేమో. వంటింటిలో పోపుల డబ్బాలో ఉండే ధనియాలు వంటింటి దినుసుగానే కాకుండా మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. ఏ కూరలో అయినా కాస్త ధనియాల పొడి వేస్తే చాలు. ఘుమ ఘుమ లాడే సువాసనతో పాటు మంచి రుచిని అందిస్తుంది.

కూరల్లో కొత్తిమీర ఎంత వాడినా మసాలా పొడిలో ధనియాలు కలిపితేనే రుచి వస్తుంది.ఈ మధ్య జరిగిన అధ్యయనాలలో ధనియాలు గ్యాస్ నుంచి ఉపశమనం కలిగించేదిగా, శరీరాన్ని చల్లబరిచేదిగా, అంతర్గత అవయవాల్లో నొప్పిని తగ్గించేదిగా,రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించటానికి సహాయపడుతుందని తేలింది.
dhaniyalu
కొత్తిమీర మొక్క‌ నుండి కాచే ఈ ధనియాల కాయలను ఎండబెట్టి, ఆ తర్వాత గింజల రూపంలో లేదా,పౌడర్ రూపంలో వీటిని ఉపయోగించు కుంటారు. ధనియాల్లో అనేక పోషకాలున్నాయి. వీటి వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను తగ్గించుకోవచ్చో వివరంగా తెలుసుకుందాం. ఈ ప్రయోజనాల గురించి తెలుసుకుంటే ధనియాలు వాడని వారు కూడా ధనియాలు వాడటం ప్రారంభిస్తారు.
Diabetes In Telugu
ధనియాల కాషాయం త్రాగటం వలన శరీరంలో వేడి తగ్గటమే కాకుండా జలుబు, జ్వరం, దగ్గు, ఆయాసం వంటివి కూడా తగ్గుతాయి. ధనియాలను ఏ రూపంలో తీసుకున్న రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ధనియాలను కషాయంగా తయారుచేసుకొని ప్రతి రోజు త్రాగితే మధుమేహం ఉన్నవారికి నియంత్రణలో ఉంటుంది.
blood thinning
అలాగే మధుమేహం రాకుండా కూడా నిరోధిస్తుంది. టైఫాయిడ్ కు కారణం అయ్యే హానికరమైన సాల్మోనెల్లా బ్యాక్టీరియాతో పోరాడే లక్షణాలు ధనియాలలో ఉన్నాయి. ఆహారం కారణంగా ఏమైనా సమస్యలు వస్తే ఆ సమస్యలు నుండి ధనియాలు బయట పడేస్తోంది. ధనియాల కషాయాన్ని రెగ్యులర్ గా త్రాగితే రక్తంలో చెడు కొలస్ట్రాల్ తొలగిపోతుంది.

ధనియాలలో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండుట వలన శరీరంను ఫ్రీ రాడికల్స్ బారి నుండి కాపాడుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ధనియాల కషాయంలో పాలు, చక్కెర కలుపుకొని తాగితే బాగా నిద్రపడుతుంది. దాంతో నిద్రలేమి సమస్య కూడా తొలగిపోతుంది. ప‌సుపులో ధ‌నియాల పొడి లేదా ర‌సాన్ని క‌లిపి మొటిమ‌ల‌పై రాసుకుంటే మొటిమ‌లు త‌గ్గుతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.