Healthhealth tips in telugu

Betel Leaf :ఈ ఆకును నీటిలో మరిగించి తాగితే…ముఖ్యంగా ఈ సమస్యలు ఉన్నవారు…

Betel Leaf Water Benefits In telugu : తమలపాకులో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. తమలపాకును మనలో చాలా మంది భోజనం అయ్యాక తింటూ ఉంటారు. తమలపాకు నీటిని తాగితే ఈ సీజన్ లో వచ్చే దగ్గు,గొంతు నొప్పి,ఇన్ ఫెక్షన్, శ్వాసకోశ సమస్యల వంటి వాటిని తగ్గించటానికి చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.
Betel Leaf Benefits in Telugu
పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోసి ఒక తమలపాకును ముక్కలుగా కట్ చేసి వేయాలి. 5 నుంచి 7 నిమిషాలు మరిగించి ఆ నీటిని వడకట్టి తాగాలి. తమలపాకును ఆయుర్వేదంలో ఎక్కువగా వాడతారు. ఈ సీజన్ లో జీర్ణ సంబంద సమస్యలు ఎక్కువగా వస్తాయి. జీర్ణశక్తిని మెరుగుపరిచి తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చేస్తుంది.
gas troble home remedies
మలబద్దకం సమస్య ఉన్నవారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రేగు కదలికలు బాగా జరిగేలా చేస్తుంది. శరీరంలో వాపులను తగ్గిస్తుంది. తమలపాకులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉండుట వలన ఛాతీలో పేరుకుపోయిన కఫాన్ని తొలగిస్తుంది. అలాగే జలుబు మరియు దగ్గు, గొంతు నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది.
Diabetes diet in telugu
డయాబెటిస్ నిర్వహణలో సహాయ పడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచటమే కాకుండా డయాబెటిస్ కారణంగా వచ్చే సమస్యలను కూడా తగ్గిస్తుంది. చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలు నియంత్రణలో ఉండేలా చేసి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. తమలపాకులో యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉండుట వలన ఆస్తమాను తగ్గిస్తుంది.

తమలపాకును మౌత్ ఫ్రెషనర్‌గా ఉపయోగిస్తున్నారు. ఇది నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. తమలపాకు నోటిలో బ్యాక్టీరియా పెరుగుదలను తగ్గించడంలో సహాయపడుతుంది, అనేక రకాల నోటి ఇన్ఫెక్షన్లు మరియు వ్యాధులను నివారిస్తుంది. అయితే రోజులో ఒకసారి మాత్రమే తమలపాకు నీటిని తీసుకోవాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.