Beauty Tips

Beauty Tips:ప్రతి రోజు ఉపయోగపడే బ్యూటీ చిట్కాలు

ఒక స్పూన్ టమోటా రసంలో ఒక స్పూన్ నిమ్మరసం కలిపి ముఖానికి రాసి 10 నిమిషాల తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే ముఖం కాంతివంతంగా మారుతుంది.

ఆవాలను మెత్తని పేస్ట్ గా చేసి ముఖానికి రాసి 5 నిముషాలు అయ్యాక ముఖాన్ని శుభ్రం చేసుకుంటే ముఖం మీద ఉన్న నల్లని మచ్చలు తొలగిపోతాయి.

కలబంద గుజ్జుకు చిటికెడు పసుపు కలిపి మొటిమలు ఉన్న ప్రదేశంలో రాస్తే మొటిమలు తొందరగా తగ్గిపోతాయి.

గోధుమ పిండిలో నీటిని కలిపి పేస్ట్ గా చేసి ముఖానికి రాసి ఆరాక చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం మీద జిడ్డు తొలగిపోతుంది.

ఉదయం స్నానము చేసే నీటిలో గులాబీ రేకులను వేసుకుంటే శరీరం పరిమళిస్తుంది.

మెడ భాగంలో నలుపు ఎక్కువగా ఉన్నట్లు అయితే పచ్చి కొబ్బరి పాలను రాసి బాగా మర్థన చేయండి. చర్మం నలుపు పోయి కాంతి వంతంగా అవుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.