Kitchenvantalu

Peanut Carrot Rolls:రోజుకి 1 తింటే చాలు విపరీతమైన ప్రోటీన్ లభిస్తుంది…

Peanut Carrot Rolls Recipe : మన శరీరానికి అవసరమైన పోషకాలు అందితే మనం చాలా ఆరోగ్యంగా ఉంటాం. ఈ మధ్యకాలంలో జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవడం అనేది చాలా కష్టం అయిపోతుంది. అయితే ఇప్పుడు చెప్పే పీనట్ క్యారెట్ Rolls తీసుకుంటే మన శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి.
peanuts side effects
వేరుశనగపప్పు అంటే బలమైన పప్పులు. దీనిలో 25% ప్రోటీన్ ఉంటుంది. మన శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. క్యారెట్ కంటికి అవసరమైన కెరోటిన్ .ని సమృద్ధిగా అందిస్తుంది. ముందుగా ఒక కప్పు వేరుశనగను డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. బాదంపప్పులను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి.

ఒక పాన్ లో కొంచెం మీగడ వేసి బాదంపప్పు ముక్కలు వేసి బాగా వేయించి… ఆ తర్వాత ఒక కప్పు క్యారెట్ తురుము వేసి పచ్చివాసన పోయేవరకు వేయించాలి. ఆ తర్వాత ఒక కప్పు తేనె వేసి బాదంపప్పు ముక్కలు క్యారెట్ తురుము బాగా ఉడికించాలి . రెండు స్పూన్ల ఓట్స్ పొడి వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.
Almond Face Tips
ఇక ఇప్పుడు వేగించిన వేరుశనగ గుళ్లను తొక్క తీసి మెత్తగా పౌడర్ తయారు చేసుకోవాలి. ఒక పాన్ తీసుకుని వేరుశనగ పౌడర్ వేయాలి. ఆ తర్వాత దానిలో ఒక కప్పు తేనె పోసి బాగా కలపాలి. స్టఫింగ్ కోసం క్యారెట్ మిశ్రమం సిద్ధం చేసుకున్నాం కదా దానిని రోల్ గా చేసి పక్కన పెట్టుకోవాలి.
oats benefits
తేనెతో చేసిన వేరుశనగపప్పు ముద్దని అప్పడాల కర్రతో చపాతీలా ఒత్తుకోవాలి. దానిపైన క్యారెట్ ఉంచి మెల్లగా చుట్టాలి పీనట్ క్యారెట్ రోల్ సిద్ధం అవుతుంది. నీట్ గా రోల్ చేసిన దాన్ని మనకు కావాల్సిన సైజులలో ముక్కలుగా కట్ చేసుకుని పైన పీనట్ పౌడర్., పిస్తా పప్పులతో డ్రెస్సింగ్ చేసుకోవాలి. .
Honey benefits in telugu
వీటిని ఫ్రిజ్ లో పెట్టుకుంటే దాదాపుగా పది రోజులు పాటు నిల్వ ఉంటాయి. ప్రతిరోజు ఒకటి తీసుకుంటే మన శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. అలాగే కంటికి సంబంధించిన సమస్యలు ఏమీ ఉండవు. మనం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి పోషకాలు ఉన్న ఆహారం తినటం అలవాటుగా చేసుకోవాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.