Healthhealth tips in telugu

Green apple:గ్రీన్ ఆపిల్ తింటున్నారా… ఈ 3 నిజాలు తెలుసుకోకపోతే నష్టపోతారు

Green Apple benefits:రోజు ఒక ఆపిల్ తింటే డాక్టర్ అవసరం ఉండదని అంటూ ఉండటం మనం వింటూనే ఉన్నాం. ఇది నిజమే. ఆపిల్ లో చాలా రకాలు ఉన్నప్పటికీ మనం రెగ్యులర్ గా ఎరుపు,ఆకుపచ్చ ఆపిల్స్ ని తింటూ ఉంటాం. ఇవి తియ్యగా మరియు పుల్లటి రుచిని కలిగి ఉంటాయి.

ఈ రోజు మనం గ్రీన్ ఆపిల్ లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించితెలుసుకుందాం. ఆపిల్ లో  అంతర్లీన ప్రోటీన్లు, విటమిన్లు,ఖనిజాలు మరియు ఫైబర్ వంటి అవసరమైన ఎన్నో పోషకాలు ఉంటాయి. గ్రీన్ ఆపిల్ లో ఇనుము, జింక్,రాగి,మాంగనీస్,పొటాషియం మొదలైన ఖనిజాలు ఉంటాయి  గ్రీన్ ఆపిల్ ని మధుమేహం ఉన్నవారు కూడా ఎటువంటి ఆలోచన లేకుండా తినవచ్చు.

ప్రతి రోజురెగ్యులర్ గా గ్రీన్ ఆపిల్ తింటే ఆస్త్మా ఉన్నవారికి మంచి ఉపశమనం కలుగుతుంది. వయస్సు పెరిగే కొద్దీ వచ్చేఅల్జీమర్స్ ని తగ్గించటమే కాకుండా జ్ఞాపకశక్తి పెరిగేలా చేస్తుంది. గ్రీన్ ఆపిల్ థైరాయిడ్ గ్రంధి పనితీరును మెరుగుపరుస్తుంది. తద్వారా కీళ్ల నొప్పులు వంటివి రాకుండా ఉంటాయి. ఒకవేళ కీళ్ల నొప్పులు ఉంటె నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది.

గ్రీన్ ఆపిల్ లో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండుట వలన కణాలపునర్నిర్మాణం మరియు కణాల పునరుత్తేజంనకు సహాయపడతాయి. అంతేకాకుండా కాలేయ పనితీరు సరిగా ఉండేలా ప్రోత్సహిస్తుంది.గ్రీన్ ఆపిల్ లో విటమిన్ C ఉండుటవల్ల ఫ్రీ రాడికల్స్ కారణంగా చర్మ కణాలకు వచ్చేనష్టాన్నినిరోధించడంలో సహాయపడుతుంది.

దాంతో  చర్మ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా వరకు తగ్గుతాయి.బరువు తగ్గాలని అనుకునేవారు రోజుకొక గ్రీన్ ఆపిల్ తింటే రక్తంలో ఉన్న కొవ్వు కరిగిపోతుంది. దాంతో బరువు తగ్గటమే కాకుండా గుండెకు సంబందించిన సమస్యలు కూడా తగ్గుతాయి. రక్త ప్రవాహం సరిగ్గా జరిగేలాప్రోత్సహిస్తుంది.

గ్రీన్ ఆపిల్ లో ఐరన్ సమృద్ధిగా ఉండుట వలన రక్తంలో ఆక్సిజన్ స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది.అంతేకాక జీవక్రియ రేటు పెంచటానికి సహాయ పడుతుంది. గ్రీన్ ఆపిల్ లో ఫైబర్ సమృద్ధిగా ఉండుట వలన జీర్ణాశయం శుభ్రం చేసి జీర్ణ సంబంధ సమస్యలు ఏమి రాకుండా కాపాడుతుంది. చాలా మంది పిల్లలుఆకలి లేదని తినటానికి మారం చేస్తూ ఉంటారు.

అలాంటి వారికి గ్రీన్ ఆపిల్ ని తినిపిస్తే ఆకలి పుడుతుంది.మైగ్రైన్ తలనొప్పితో బాధపడేవారు ప్రతి రోజు ఒక గ్రీన్ ఆపిల్ తింటే మంచి ఉపశమనం కలుగుతుంది. రెడ్ ఆపిల్ కంటే గ్రీన్ ఆపిల్లో చాలా తక్కవ క్యాలరీలుండటం వల్ల ఆరోగ్యానికి మరింత బెటర్ గా సహాయపడుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.