Kitchenvantalu

Pesarattu Pulusu Curry Recipe:పాతకాలం నాటి వంట పెసరట్టు పులుసు.. తింటే అసలు వదిలిపెట్టరు

Pesarattu Pulusu Curry Recipe:పెసరట్టు పులుసు కూర..పెసరట్టు ఎంత రుచికరమైనదో అంత ఆరోగ్యకరం కూడ.హెల్తీ పెసరట్టుతో మసాల పులుసుకూర ఎప్పుడైనా చేసారా.లేదంటే ఈ సారీ ట్రై చేయండి.రుచి అదిరిపోతుంది.

కావాల్సిన పదార్ధాలు
పెసలు – 1 కప్పు
పచ్చిమిర్చి – 6-7
అల్లం ముక్క – 1 ఇంచ్
జీలకర్ర – 1 టీస్పూన్
ధనియాలు – 2 టీ స్పూన్స్
లవంగాలు – 4
యాలకులు – 2
దాల్చిన చెక్క – 2 ఇంచ్ లు
చింతపండు – 15-20 గ్రాములు
ఉల్లిపాయలు – 2
అల్లంవెల్లుల్లి పేస్ట్ – 1 టీ స్పూన్
కారం – 1 టీ స్పూన్
కరివేపాకు – 2 రెమ్మలు
కొత్తిమీర – కొద్దిగా

తయారీ విధానం
1.కప్పు పెసలను కడిగి నాలుగు నుంచి ఐదు గంటలు నానబెట్టుకోవాలి.
2.మిక్సిజార్ లోకి పచ్చిమిర్చి,అల్లం,తీసుకోని గ్రైండ్ చేసుకోవాలి.
3.నానబెట్టుకున్న పెసలను గ్రైండ్ చేసుకోని పిండిని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి.
4.అందులోకి తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి.
5.ప్యాన్ వేడి చేసి గరిటడు పిండిని వేసి అట్టును స్ప్రెడ్ చేసుకోవాలి.
6.అంచులకు నూనె వేసి రెండు వైపుల కాల్చుకోవాలి.
7.తయారు చేసుకున్న పెసరట్టును ముక్కలుగా కట్ చేసుకోవాలి.

8.పెసరట్టు పులుసు మసాలా కోసం మిక్సి జార్ లో జీలకర్ర,కొత్తిమీర ,లవంగాలు,యాలకులు,దాల్చిన చెక్క ను వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
9.ఇప్పుడు పులుసు కోసం చింతపండును నానబెట్టి రసం తీసి పక్కన పెట్టుకోవాలి.
10.స్టవ్ పై బాండీ పెట్టుకోని ఆయిల్ వేడి చేసి అందులోకి తరిగిన ఉల్లిపాయలు వేపుకోవాలి.
11.అందులోకి పసుపు,ఉప్పు,పచ్చిమిర్చి,అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేపుకోవాలి.
12.ఉల్లిపాయలు వేగాక చింతపండు రసం ,కారం వేసి సరిపడా నీళ్లను వేసి కలుపుకోవాలి.
13.అందులోకి పెసరట్టు ముక్కలను వేసి మసాలా వేసి మూతపెట్టి లో ఫ్లేమ్ పై ఉడకనివ్వాలి.
14.కరివేపాకు వేసుకోని స్టవ్ ఆఫ్ చేసుకుంటే పెసరట్టు పులుసు చిక్కగా తయారౌతుంది.